టీజీ ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. అందుబాటులో 1.14 లక్షల సీట్లు
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు వీలుగా ఎప్‌సెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1 లక్షా 14 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. టీజీ ఎప్‌సెట్ (గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు) ఉత్తీర్ణులైన విద్యార్థులకు అడ్మిషన్ పొందే ప్రక్రియలో కళాశాలను ఎంచుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10 వరకు అందుబాటులో ఉంటుంది. 5 మొత్తంగా 171 కళాశాలల్లో 1.14 లక్షల సీట్లు ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో అందుబాటులోకి వచ్చాయి. వెబ్ కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టీజీ ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. అందుబాటులో 1.14 లక్షల సీట్లు
మొత్తం 21 ప్రభుత్వ కళాశాల్లలో 5,808 సీట్లు, 148 ప్రయివేటు కళాశాలల్లో 99,610 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 2 ప్రయివేటు వర్శిటీలు కూడా 1,800 సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా 6,500 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్రాంచీల వారీగా సీట్లు
ఇంజినీరింగ్ బ్రాంచీల వారీగా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లలో కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సులవే అధికం. సీఎస్ఈ 26,150, సీఎస్ఈ (ఏఐ-ఎంఎల్) 12,495 సీట్లు, సీఎస్ఈ (డేటా సైన్స్) కోర్సులో 6,996 సీట్లు, ఐటీ బ్రాంచ్ లో 3,681 సీట్లు, సీఎస్ఈ సైబర్ టెక్నాలజీ బ్రాంచ్ లో 1,439 సీట్లు ఉన్నాయి. అలాగే ఈసీఈలో 10,125 సీట్లు, ట్రిపుల్ ఈలో 4,301 సీట్లు, సివిల్ లో 3,129 సీట్లు, మెకానికల్ లో 3 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More