ఈనెల 7న తెలంగాణ ఐసెట్ - 2025 ఫలితాలు …. ఎలా చెక్ చేసుకోవాలంటే..?
టీజీ ఐసెట్ -2025 ఫలితాలు విడుదల కానున్నాయి. జూలై 7వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు icet.tgche.ac.in వెబ్ సైట్ ద్వారా ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూలై 7వ తేదీన రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 8, 9 తేదీలో ఐసెట్పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను కల్పిస్తారు.
టీజీ ఐసెట్ 2025 ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే
- పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టీజీ ఐసెట్ రిజల్ట్స్ 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు మరిన్ని వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ఫలితానికి సంబంధించిన కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.
పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సీట్లను కేటాయిస్తారు. ర్యాంక్ ఆధారంగా వీటిని కేటాయిస్తారు. గతేడాది ఐసెట్ సీట్లకు బాగా డిమాండ్ కనిపించింది. ఈసారి కూడా అదే మాదిరిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


