Vijay : సామాన్యుడి స్విఫ్ట్ నుంచి లగ్జరీ కార్ల వరకు- కోట్లు విలువ చేసే విజయ్ గ్యారేజ్ ఇదే..
Vijay luxury car collection : దళపతి విజయ్ గ్యారేజ్ అంటే రాజసం, రాజసం అంటే విజయ్ గ్యారేజ్! లగ్జరీ కార్ల నుంచి సామాన్యుడి స్విఫ్ట్ వరకు విజయ్ వద్ద ఉన్న కోట్లు విలువ చేసే ఆ వాహనాల ప్రత్యేకతలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
Vijay TVK : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ పేరే వినిపిస్తోంది. సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దళపతి, ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్‌పై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే విజయ్ స్టైల్ కేవలం సినిమాలకో, పాలిటిక్స్‌కో పరిమితం కాదు.. ఆయన వాడే వాహనాల్లోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది! మరీ ముఖ్యంగా విజయ్ గ్యారేజ్‌లో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లతో పాటు సామాన్యుడు వాడే చిన్న కారు కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో విజయ్ గ్యారేజ్‌లో కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

లెక్సస్ ఎల్ఎం 350హెచ్: కదిలే విలాసవంతమైన ఇల్లు..
విజయ్ గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన, అత్యంత విలాసవంతమైన వాహనం అంటే అది లెక్సస్ ఎల్ఎం 350హెచ్ అని చెప్పొచ్చు. దీని ధర సుమారు రూ. 2.20 కోట్లు. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు, రోడ్డుపై కదిలే ఒక ప్రైవేట్ లాంజ్ అని చెప్పుకోవాలి. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. లోపల ఏకంగా 48 ఇంచ్ భారీ స్క్రీన్, అత్యంత ఖరీదైన సీటింగ్ సౌకర్యం ఉంటుంది. ట్రాఫిక్‌లో ఉన్నా సరే, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి విజయ్ దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారని టాక్.
రోడ్లపై రారాజు: బీఎండబ్ల్యూ శ్రేణి కార్లు..
లగ్జరీ సెడాన్ల విషయానికి వస్తే విజయ్ వద్ద రెండు అత్యుత్తమ బీఎండబ్ల్యూ మోడల్స్ ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఐ7: మారుతున్న కాలానికి అనుగుణంగా విజయ్ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపారు. సుమారు రూ. 2.5 కోట్ల విలువైన ఈ ఎలక్ట్రిక్ సెడాన్, ఒకసారి ఛార్జ్ చేస్తే వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆఫర్ చేస్తుంది. వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించే వారికి థియేటర్ అనుభూతిని ఇచ్చే స్క్రీన్ దీని ప్రత్యేకత.
బీఎండబ్ల్యూ 5 సిరీస్: దైనందిన అవసరాల కోసం, పర్ఫార్మెన్స్ కోసం విజయ్ ఈ కారును వాడుతుంటారు. దీని ధర రూ. 74.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతికి ఈ కారు పెట్టింది పేరు.
Vijay TVK : ‘విజయ్ అనే నేను’.. తమిళనాడు సీఎంగా దళపతి! నెట్ వర్త్ ఎంతో తెలుసా?
రాజకీయ ప్రయాణాల్లో తోడుగా.. టయోటా వెల్‌ఫైర్!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ ఎక్కువగా కనిపిస్తున్న కారు టయోటా వెల్‌ఫైర్. సుమారు రూ. 1.19 కోట్ల ధర కలిగిన ఈ ఎంపీవీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఫేవరెట్! సుదీర్ఘ ప్రయాణాలు చేసినా అలసట రాకుండా ఉండేలా దీని సీట్లను డిజైన్ చేశారు. పబ్లిక్ మీటింగ్స్, షూటింగ్ స్పాట్‌లకు వెళ్లేటప్పుడు విజయ్ ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నారు.
షాకింగ్ ఎలిమెంట్: మారుతీ సుజుకీ స్విఫ్ట్ కూడా!
కోట్లు సంపాదించే సూపర్ స్టార్ గ్యారేజీలో అతి సామాన్యమైన, సామాన్యుడికి ఇష్టమైన కారు ఉంటుందని ఎవరూ ఊహించరు. కానీ విజయ్ దగ్గర ఒక మారుతీ సుజుకీ స్విఫ్ట్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాన్యుడిలా వెళ్లడానికి ఆయన ఈ కారును వాడిన సందర్భాలు ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన వ్యక్తిత్వానికి ఈ కారు ఒక నిదర్శనం.
గతంలో వాడిన రోల్స్ రాయిస్ ఘోస్ట్..
విజయ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన రోల్స్ రాయిస్ కారు. గతంలో ఆయన 'రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్-1' మోడల్‌ను ఉపయోగించారు. అప్పట్లో దీని ధర సుమారు రూ. 2 కోట్లు ఉండేది. వీ12 ట్విన్ టర్బో ఇంజిన్‌తో నడిచే ఈ కారు రాజసానికి కేరాఫ్ అడ్రస్. అయితే ఇటీవల ఈ కారును విక్రయానికి ఉంచినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. దళపతి విజయ్ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు ఏది?
విజయ్ వద్ద ఉన్న కార్లలో BMW i7, లెక్సస్ LM 350h అత్యంత ఖరీదైనవి. వీటి ధరలు రూ. 2.20 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ఉంటాయి.
2. విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక ఏ కారును ఎక్కువగా వాడుతున్నారు?
విజయ్ ప్రస్తుతం తన రాజకీయ పర్యటనలు, బహిరంగ కార్యక్రమాల కోసం టొయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire) కారును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
3. విజయ్ వద్ద మారుతి స్విఫ్ట్ ఉందన్నది నిజమేనా?
అవును, మీడియా కథనాల ప్రకారం విజయ్ గ్యారేజీలో ఒక మారుతీ సుజుకీ స్విఫ్ట్ కూడా ఉంది. సామాన్య ప్రజల మధ్యకు వెళ్లేటప్పుడు లేదా సింపుల్‌గా ప్రయాణించాలనుకున్నప్పుడు ఆయన దీన్ని వాడుతుంటారు.
4. విజయ్ తన రోల్స్ రాయిస్ కారును ఎందుకు అమ్మేశారు?
విజయ్ తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును విక్రయానికి ఉంచినట్లు వార్తలు వచ్చాయి. సాధారణంగా సెలబ్రిటీలు తమ కార్ల కలెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే క్రమంలో పాత మోడళ్లను విక్రయిస్తుంటారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


