...
...
Next Story

‘ఇది బాగుంది కదూ!’ 14ఏళ్ల బాలిక గురించి ఎప్​స్టీన్​- ట్రంప్​ మధ్య సంభాషణ..

అమెరికాను ఊపేసిన సెక్స్​ కుంభకోణంలో.. కీలక పాత్ర పోషించిన ఎప్​స్టీన్​ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను యూఎస్​ జస్టిస్​ డిపార్ట్​మెంట్​ విడుదల చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- ఎప్​స్టీన్​ మధ్య ఒక బాలిక గురించి అసభ్యకరమైన సంభాషణ జరిగినట్టు పత్రాలు సూచిస్తున్నాయి.

Published on: Dec 20, 2025 08:16 AM IST
Advertisement

ఫైనాన్షియర్​, సెక్స్​ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జెఫ్రీ ఎప్​స్టీన్​ కేసులో తాజాగా విడుదలైన డాక్యుమెంట్లు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి! జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఉంచిన ఈ డాక్యుమెంట్ల ద్వారా, నాటి మైనర్ బాలిక (జేన్ డో - మారుపేరు) విషయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పీడోఫైల్​ కన్విక్ట్​ (బాలికలతో లైంగిక చర్యకు పాల్పడేవారు) ఎప్​స్టీన్​ మధ్య జరిగిన ఒక అభ్యంతరకర సంభాషణ వెలుగులోకి వచ్చింది.

ఆ 14 ఏళ్ల బాలిక గురించి ట్రంప్‌తో సంభాషణ..

ఎప్​స్టీన్​తో ట్రంప్​ ఫొటో.. (REUTERS)
ఎప్​స్టీన్​తో ట్రంప్​ ఫొటో.. (REUTERS)

గతంలో డొనాల్డ్ ట్రంప్‌ కేవలం ఒక వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు, ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను ఎప్​స్టీన్ పరిచయం చేశాడు. ఆమెను చూపిస్తూ ఎప్​స్టీన్​​ చేసిన వ్యాఖ్యలు ఈ పత్రాల్లో ఉన్నాయి.

ఆ పత్రంలోని వివరాల ప్రకారం:

"14 ఏళ్ల మైనర్ బాలికను ట్రంప్‌కు పరిచయం చేస్తూ.. 'ఇది (అమ్మాయి) బాగుంది కదా?' అని అడిగాడు. దానికి ట్రంప్ నవ్వుతూ, అవునన్నట్లు తల ఊపారు. ఇద్దరూ కలిసి నవ్వుకుంటుంటే, ఆ బాలికకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ అప్పుడు ఆమె వయసు చాలా తక్కువ కావడంతో, వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు."

ఎప్​స్టీన్​ ఆ బాలికను ట్రంప్ నివాసమైన 'మార్-ఎ-లాగో'కు తీసుకెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.

సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ఈ పత్రాల్లో చాలా చోట్ల కీలక సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి నల్లటి మార్కులు, స్టిక్కీ నోట్స్ వాడారు!

తర్వాతి కాలంలోనూ కొనసాగిన అకృత్యాలు..

ఆ మైనర్ బాలికపై ఎప్​స్టీన్​ అరాచకాలు అక్కడితో ఆగలేదు. 1994 చివరిలో, మోడలింగ్ ఫోటోల పేరుతో ఆమెను తన పూల్ హౌస్‌కు పిలిపించి వేధింపులకు గురిచేశాడని పత్రాలు వెల్లడిస్తున్నాయి. బాలికను తన ఒడిలో కూర్చోపెట్టుకుని హస్తప్రయోగం చేశాడని పత్రాలు స్పష్టం చేశాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు ఇలాగే చేస్తారని నమ్మించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వివరించాయి.

ఎప్​స్టీన్​ కేసులో పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని పోరాడుతున్న రిపబ్లికన్ ఎంపీ థామస్ మాస్సీ.. జస్టిస్ డిపార్ట్‌మెంట్ తీరుపై మండిపడ్డారు. ట్రంప్ సంతకం చేసిన చట్టం ప్రకారం పత్రాలన్నీ విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం చట్ట నిబంధనలను పాటించడంలో దారుణంగా విఫలమైందని ఆయన విమర్శించారు.

రో ఖన్నా అనే రాజకీయ నాయకుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "లక్షలాది పేజీలను విడుదల చేసినా, చట్టాన్ని మాత్రం అమలు చేయలేదు. ముఖ్యంగా 119 పేజీల గ్రాండ్ జ్యూరీ సాక్ష్యాన్ని పూర్తిగా కనిపించకుండా చేశారు," అని అసహనం వ్యక్తం చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe