భారతీయులు ఎగబడి కొంటున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది- వెయిటింగ్ పీరియడ్ ఎక్కువే!
టాటా హారియర్ ఈవీకి దేశంలో భారీ డిమాండ్ కనిపిస్తోంది! బేస్ వేరియంట్‌పై ఎకంగా 3 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తుండం విశేషం. ఇతర వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ కూడా నెల కన్నా తక్కువ లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాటా హారియర్ ఈవీకి భారతదేశం అంతటా బలమైన డిమాండ్ కనిపిస్తోంది! దీని కారణంగా, కొన్ని వేరియంట్‌లకు డెలివరీ సమయం బాగా పెరిగింది. ముఖ్యంగా బేస్ అడ్వెంచర్ వేరియంట్‌కు ప్రస్తుతం 2.5 నుంచి 3 నెలల వరకు (సుమారు 10 నుంచి 12 వారాలు) అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మధ్యస్థాయి వేరియంట్‌ను 1 నుంచి 2 నెలల్లో డెలివరీ చేయవచ్చని అంచనా వేయగా, టాప్-ఎండ్ ట్రిమ్ కొనుగోలుదారులను చేరుకోవడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది.

టాటా హారియర్ ఈవీ: వేరియంట్లు, ధరల శ్రేణి
టాటా హారియర్ ఈవీ మొత్తం ఐదు కీలక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది:
- అడ్వెంచర్
- అడ్వెంచర్ ఎస్
- ఫియర్‌లెస్ ప్లస్
- ఎంపవర్‌డ్
- ఎంపవర్‌డ్ ఏడబ్ల్యూడీ
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరలు రూ.21.49 లక్షల నుంచి రూ. 30.23 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ప్రతి వేరియంట్ టెక్నాలజీ, ఫీచర్లు, డిజైన్ ఎలిమెంట్స్ ప్రత్యేక కలయికను అందిస్తుంది. పట్టణ ఈవీ కొనుగోలుదారులకే కాకుండా, బలమైన ఎలక్ట్రిక్ పనితీరును కోరుకునే సాహస ప్రియులకు కూడా సరిపోయేలా దీనిని రూపొందించింది టాటా మోటార్స్ సంస్థ.
బ్యాటరీ, రేంజ్, పనితీరు విశేషాలు..
హారియర్ ఈవీ, టాటాకి చెందిన అధునాతన acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. అవి..
65 కేడబ్ల్యూహెచ్ యూనిట్: ఇది 538 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది.
75 కేడబ్లయూహెచ్ యూనిట్: ఇది డ్రైవ్‌ట్రైన్‌ను బట్టి 620 కి.మీలకు పైగా రేంజ్‌ను అందిస్తుంది.
రియర్-వీల్-డ్రైవ్: ఇది సుమారు 235 బీహెచ్‌పి పవర్, 315 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఆల్-వీల్-డ్రైవ్: ఇది మరింత శక్తివంతమైన 391 బీహెచ్‌పీ, 504 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది ఎలాంటి భూభాగంలోనైనా అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
ప్రీమియం క్యాబిన్, టెక్నాలజీ..
హారియర్ ఈవీ లోపలి భాగం అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీని మిళితం చేసింది టాటా మోటార్స్. ముఖ్యమైన ఫీచర్లు:
- 14.5-అంగుళాల శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- 540° కెమెరా (360 డిగ్రీల కంటే విస్తృత వీక్షణ)
- ఆరు టెర్రైన్ మోడ్‌లు: ఇందులో రాక్ , మడ్, స్నో మోడ్‌లు ఉన్నాయి.
ఈ టాటా హారియర్ ఈవీ అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్‌ను కలిగి ఉంది. ఈ విభాగంలో అత్యంత ఎక్కువ ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఇది ఒకటి.
బలమైన డిమాండ్ – ఈవీల ఆదరణకు సంకేతం
ఈ టాటా హారియర్ ఈవీకి అధిక వెయిటింగ్ పీరియడ్ ఉండటం, భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. హారియర్ ఈవీ ఆకర్షణీయమైన స్టైలింగ్, సుదీర్ఘ శ్రేణి, అధునాతన ఫీచర్లు దీన్ని మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ఒక బ్యాచ్‌మార్క్‌గా నిలిపాయి.
ముఖ్యంగా ఈ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బేస్ అడ్వెంచర్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు వెంటనే ఆర్డర్‌లను ఇవ్వాలని సూచించడమైనది. ఎందుకంటే పెరుగుతున్న డిమాండ్‌తో వెయిటింగ్ టైమ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
హారియర్ ఈవీకి మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ 9ఈ, బీవైడీ ఆటో 3 వంటి ఎలక్ట్రిక్ కార్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


