భారతదేశంలోని చిన్న నగరాలు, పట్టణాల్లోని యువత నేటి ఉద్యోగ విపణికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు, అసలు వారు ఉద్యోగ సన్నద్ధత సాధించేందుకు తగిన అవకాశాలు దక్కుతున్నాయా అని ఆలోచించాలి. దేశంలో వేగంగా పెరుగుతున్న కొలువుల సృష్టి ఒకవైపు, వాటిని అందుకునేందుకు తపిస్తున్న టియర్-2, టియర్-3 నగరాల ప్రతిభావంతులు మరొకవైపు కనిపిస్తున్నారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య ఉన్న అంతరం మాత్రం ఇంకా పూడలేదు.
పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చిన్న నగరాలకు విస్తరిస్తున్న సంస్థల్లో 36 శాతం యాజమాన్యాలు ప్రత్యక్ష అనుభవ లేమినే (Practical exposure deficit) తమ ప్రధాన నియామక సమస్యగా పేర్కొన్నాయి. మరోవైపు, స్థానికంగా పరిశ్రమలు లేకపోవడమే ఉద్యోగ వేటలో పెద్ద అడ్డంకిగా మారిందని దాదాపు 40 శాతం మంది అభ్యర్థులు తెలిపారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు లేవని చాలామంది ఆవేదన వ్యక్తం చేయగా, కళాశాలల్లో పరిశ్రమ స్థాయి టూల్స్, సాఫ్ట్‌వేర్‌లను అసలు అలవాటు చేయలేదని 81 శాతం మంది విద్యార్థులు స్పష్టం చేశారు.
విద్యకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న దూరం
టియర్-2, టియర్-3 నగరాల పట్టభద్రులకు తరగతి గది నుంచి పని ప్రదేశానికి ఉన్న దూరం కంటే, విద్యకు-ఉద్యోగానికి మధ్య ఉన్న దూరం చాలా ఎక్కువగా ఉంటోంది. అక్కడ ఇంటర్న్‌షిప్ ఇచ్చే కంపెనీలు తక్కువ, క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చే రిక్రూటర్లు అరుదు. కంపెనీల్లో వాడే ఆధునిక పరికరాలను తాకే అవకాశం ఉండదు. అసలు పరిశ్రమలు తమ ఉద్యోగుల నుంచి ఏమి ఆశిస్తున్నాయో తెలుసుకునే మార్గాలు పరిమితం. ఫలితంగా నియామకాల ప్రక్రియలో యజమానులు, అభ్యర్థులు ఇద్దరూ ఒకే రకమైన సవాలును వేర్వేరు కోణాల్లో ఎదుర్కొంటున్నారు.
నైపుణ్యమా? అవకాశాల లేమా?
మనం కొలుస్తున్నది యువతలోని ఉద్యోగ అర్హతనా లేక వారికి లభిస్తున్న అవకాశాల స్థాయినా? ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎంతో ముఖ్యం. నైపుణ్యం అనేది ప్రాంతంతో సంబంధం లేకుండా నేర్చుకోగలిగేది. కానీ ఆ నైపుణ్యాన్ని సాధించాలంటే పరిశ్రమలు, సాంకేతికత, ప్రత్యక్ష పని సంస్కృతి, ఇంటర్న్‌షిప్‌లు, మార్గదర్శకులు, వాస్తవ సమస్యల పరిష్కారం వంటి వనరులతో అనుసంధానం కావాలి. ఏ మౌలిక సదుపాయాలూ లేని వాతావరణంలో పెరిగే యువతకు ప్రత్యక్ష అనుభవం ఎలా సాధ్యమవుతుంది? అందుకే, వారి రెజ్యూమెలో కనిపిస్తున్న లోపం నైపుణ్యానిది కాదు, భౌగోళిక వ్యత్యాసానిది.
డిగ్రీ ఉంటే సరిపోతుందా?
{{/usCountry}}మనం కొలుస్తున్నది యువతలోని ఉద్యోగ అర్హతనా లేక వారికి లభిస్తున్న అవకాశాల స్థాయినా? ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎంతో ముఖ్యం. నైపుణ్యం అనేది ప్రాంతంతో సంబంధం లేకుండా నేర్చుకోగలిగేది. కానీ ఆ నైపుణ్యాన్ని సాధించాలంటే పరిశ్రమలు, సాంకేతికత, ప్రత్యక్ష పని సంస్కృతి, ఇంటర్న్‌షిప్‌లు, మార్గదర్శకులు, వాస్తవ సమస్యల పరిష్కారం వంటి వనరులతో అనుసంధానం కావాలి. ఏ మౌలిక సదుపాయాలూ లేని వాతావరణంలో పెరిగే యువతకు ప్రత్యక్ష అనుభవం ఎలా సాధ్యమవుతుంది? అందుకే, వారి రెజ్యూమెలో కనిపిస్తున్న లోపం నైపుణ్యానిది కాదు, భౌగోళిక వ్యత్యాసానిది.
డిగ్రీ ఉంటే సరిపోతుందా?
{{/usCountry}}విద్యాభ్యాసంలో పొందే డిగ్రీ అనేది అభ్యర్థికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలిపే ప్రమాణంగా ఉండేది. అయితే, టియర్-2, టియర్-3 సంస్థల నుంచి వచ్చే డిగ్రీలు అభ్యర్థి నైపుణ్యానికి పూర్తి ఆధారంగా పనిచేయడం లేదని పది మంది యజమానుల్లో తొమ్మిది మంది భావిస్తున్నారు. చాలా సంస్థల దృష్టిలో డిగ్రీ అనేది కేవలం దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఒక అర్హత పత్రంగా మిగిలిపోయింది గానీ, పనిచేసే సామర్థ్యానికి నిదర్శనం కావడం లేదు.
రెట్టింపు ప్రతికూలత.. అదృశ్య వడపోత
చిన్న నగరాల విద్యార్థులు రెట్టింపు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొదటగా, వారికి పరిశ్రమలకు కావలసిన ప్రత్యక్ష నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలు లభించడం లేదు. రెండోది, వారు ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు, ప్రముఖ ప్రీమియర్ విద్యాసంస్థల నుంచి వస్తే తప్ప వారి డిగ్రీకి తగిన గుర్తింపు లభించడం లేదు.
కంపెనీలు కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇవ్వలేవు. పని చేయగలిగే వ్యక్తులే వాటికి కావాలి. డిగ్రీ పరిధికి మించిన నైపుణ్యాలను తనిఖీ చేయడం, ప్రత్యక్ష అనుభవ లేమిని భర్తీ చేయడం యజమానులకు అదనపు ఖర్చుగా మారుతోంది. ఇది చివరికి ఒక విషవలయంగా మారుతోంది. అనుభవం లేకపోవడం వల్ల నైపుణ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నారు, సామర్థ్యంపై నమ్మకం కుదరక కంపెనీలు నియామకాలను తగ్గిస్తున్నాయి. దాంతో ఉద్యోగావకాశాలు మరింత క్షీణిస్తున్నాయి. ఈ క్రమంలో భౌగోళిక ప్రాంతం అనేది ఉద్యోగ విపణిలో ఒక అదృశ్య వడపోతగా (Invisible filter) మారుతోంది. మొదటి ఉద్యోగం వచ్చినా ఈ సమస్య తీరడం లేదు. మెరుగైన భవిష్యత్తు కోసం కచ్చితంగా టీయర్-1 నగరాలకు తరలివెళ్లాల్సిందేనని మెజారీటీ యువత భావిస్తోంది.
పరిష్కారం ఎక్కడ ఉంది?
చిన్న నగరాల ప్రతిభావంతుల ప్రమాణాలను తగ్గించడం దీనికి పరిష్కారం కాదు. యజమానులు, విద్యావేత్తలు, విధానకర్తలు కలిసి సమగ్ర వ్యవస్థను నిర్మించాలి. కేవలం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఆ నైపుణ్యాన్ని ప్రత్యక్ష పనులకు, అవకాశాలకు జోడించాలి. ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, వర్క్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విధానాలను కేవలం పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా విస్తరించాలి. డిగ్రీ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, కళాశాల దశ నుంచే కంపెనీల్లో వాడే ఆధునిక సాంకేతికతను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి.
భారత్‌లో మెట్రో నగరాల వెలుపల ప్రతిభకు కొరత లేదు. ఉన్నదల్లా ప్రతిభ ఉన్న ప్రాంతానికి, అవకాశాలున్న ప్రాంతానికి నడుమ ఉన్న అంతరమే. ఈ అంతరాన్ని పూడ్చడమే భారత ఆర్థిక వ్యవస్థ తదుపరి ప్రగతికి అత్యంత కీలకమైన అడుగు. యువత ఎక్కడ ప్రయాణం ప్రారంభించిందనే అంశం, వారు ఎంత ఎత్తుకు ఎదుగుతారనే దాన్ని నిర్ణయించకూడదు.
వ్యాసకర్త:
సోనాల్ అరోరా,
కంట్రీ మేనేజర్,
జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా