Tim Cook news : ప్రపంచ టెక్ రంగంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎదిగిన యాపిల్‌లో ఒక శకం ముగియబోతోంది! ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ (65) ఈ సెప్టెంబర్‌లో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన సంస్థకు పూర్తిగా దూరం కాకుండా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ‘ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్’గా బాధ్యతలు నిర్వహించనున్నారు. టిమ్ కుక్ వారసుడిగా యాపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
టిమ్ కుక్ ప్రస్థానం: స్టీవ్ జాబ్స్ వారసుడిగా..

1998లో యాపిల్‌లో చేరిన టిమ్ కుక్, ఆపరేషన్స్ విభాగంలో తనదైన ముద్ర వేశారు. 2011లో దిగ్గజ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అనారోగ్యంతో తప్పుకున్నప్పుడు కుక్ సీఈఓగా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో యాపిల్ భవిష్యత్తుపై చాలామందికి అనుమానాలు ఉండేవి. కానీ, కుక్ తన అసాధారణ నాయకత్వంతో వాటన్నింటినీ పటాపంచలు చేశారు. ఐఫోన్ల విక్రయాలను ప్రపంచవ్యాప్తం చేయడమే కాకుండా, కంపెనీ మార్కెట్ విలువను ఏకంగా 4 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 330 లక్షల కోట్లు) చేర్చి చరిత్ర సృష్టించారు.
"యాపిల్ వంటి అసాధారణ సంస్థకు సీఈఓగా పని చేయడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను," అని టిమ్ కుక్ తన ప్రకటనలో భావోద్వేగంగా పేర్కొన్నారు.
కొత్త వారసుడు జాన్ టెర్నస్ ఎవరు?
యాపిల్ తదుపరి సీఈఓగా ఎంపికైన జాన్ టెర్నస్ సంస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన ఆయన, గత రెండు దశాబ్దాలుగా హార్డ్‌వేర్ ఇంజనీరింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐఫోన్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్, మ్యాక్ కంప్యూటర్ల రూపకల్పనలో ఆయన కృషి ఎంతో ఉంది. టిమ్ కుక్ స్వయంగా టెర్నస్‌కు మెంటార్‌గా వ్యవహరించడం విశేషం.
50 ఏళ్ల యాపిల్ ముందన్న సవాల్: ఏఐ..
యాపిల్ సంస్థ ఈ ఏడాది తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1976 ఏప్రిల్ 1న ఒక చిన్న గ్యారేజీలో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ ప్రారంభించిన ఈ ప్రయాణం నేడు ప్రపంచ జీవనశైలినే మార్చేసింది. అయితే, ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ, యాపిల్ తన మునుపటి ఆవిష్కరణల మాదిరిగానే మరో కొత్త విప్లవాన్ని తీసుకురావాల్సిన ఒత్తిడిలో ఉంది. కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}యాపిల్ సంస్థ ఈ ఏడాది తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1976 ఏప్రిల్ 1న ఒక చిన్న గ్యారేజీలో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ ప్రారంభించిన ఈ ప్రయాణం నేడు ప్రపంచ జీవనశైలినే మార్చేసింది. అయితే, ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ, యాపిల్ తన మునుపటి ఆవిష్కరణల మాదిరిగానే మరో కొత్త విప్లవాన్ని తీసుకురావాల్సిన ఒత్తిడిలో ఉంది. కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}మరోవైపు సీఈఓ పదవి నుంచి టిమ్ కుక్ తప్పుకుంటున్నట్ట ప్రకటించడంతో సోమవారం ట్రేడింగ్ సెషన్లో యాపిల్ సంస్థ షేర్లు 1శాతం నష్టపోయాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. టిమ్ కుక్ యాపిల్ సీఈఓ పదవి నుంచి ఎప్పుడు తప్పుకుంటారు?
టిమ్ కుక్ 2026 సెప్టెంబర్‌లో సీఈఓ పదవి నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత ఆయన యాపిల్ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు.
2. యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ నేపథ్యం ఏమిటి?
జాన్ టెర్నస్ 2001 నుంచి యాపిల్‌లో పనిచేస్తున్నారు. ఆయన హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో నిపుణుడు. ఐఫోన్, మ్యాక్ వంటి ప్రధాన ఉత్పత్తుల డిజైనింగ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు.
3. టిమ్ కుక్ హయాంలో యాపిల్ సాధించిన అతిపెద్ద విజయం ఏంటి?
టిమ్ కుక్ నేతృత్వంలో యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. దీని మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడం ఆయన అతిపెద్ద ఘనతగా చెప్పవచ్చు.