పండుగల సీజన్ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నేడు (సోమవారం, అక్టోబర్ 19, 2026) బ్యాంకులకు సెలవు అమల్లో ఉంది. మహానవమి, మహాష్టమి, ఆయుధ పూజ, దుర్గా పూజ పండుగల వేడుకల నేపథ్యంలో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ సెలవులను ఖరారు చేసింది. అయితే ఈ పండుగ సెలవులు దేశమంతటా ఒకే విధంగా వర్తించవు. కొన్ని రాష్ట్రాల్లో నేడు బ్యాంకులు తెరిచి ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి.

పండుగ వేళ అత్యవసర ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు తమ ప్రాంతంలో బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయో లేదో ముందే తెలుసుకోవడం అవసరం.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 2026న బ్యాంకు సెలవుల వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈరోజు బ్యాంకులకు సెలవు- ఎక్కడెక్కడ?
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 19న పలు ఈశాన్య, తూర్పు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం, ఒడిశా, తమిళనాడు, అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, బీహార్, ఝార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాల్లో మహానవమి, దుర్గాపూజ సంబరాల దృష్ట్యా బ్యాంకులు మూతపడ్డాయి.
వీటితో పాటు ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా స్థానిక ప్రభుత్వం పండుగ సెలవుగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ ప్రాంతాల్లో విజిట్ చేయాలనుకునే ఖాతాదారులు నేరుగా శాఖలకు వెళ్లవచ్చు.
అయితే విజయ దశమి కారణంగా రేపు, అంటే అక్టోబర్ 20న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆర్బీఐ పండుగ సెలవుల మార్గదర్శకాలు..
దేశంలో బ్యాంకుల సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం మూడు విభాగాల్లో నిర్ణయిస్తారు. అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సెలవులు, ఖాతాల ముగింపు సమయాలు. ప్రతినెల రెండొవ, నాల్గొవ శనివారాలతో పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. మొదటి, మూడొవ, ఐదొవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం లభ్యం..
{{/usCountry}}దేశంలో బ్యాంకుల సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం మూడు విభాగాల్లో నిర్ణయిస్తారు. అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సెలవులు, ఖాతాల ముగింపు సమయాలు. ప్రతినెల రెండొవ, నాల్గొవ శనివారాలతో పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. మొదటి, మూడొవ, ఐదొవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం లభ్యం..
{{/usCountry}}భౌతిక బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ లావాదేవీలు, ఏటీఎం సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఖాతాదారులకు డబ్బుల బదిలీ, కరెంట్ బిల్లుల చెల్లింపులు, ఇతర ఆన్‌లైన్ లావాదేవీలు నిరంతరాయంగా పనిచేస్తాయి.