Budget electric cars : త్వరలోనే బడ్జెట్ ఈవీల జాతర! లాంచ్​కి రెడీ అవుతున్న టాప్-5 అఫార్డిబుల్ కార్లు ఇవే..

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా మారుతోంది. కేవలం లగ్జరీ కార్లకే పరిమితం కాకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా బడ్జెట్‌లో టాటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, రెనాల్ట్, విన్‌ఫాస్ట్ సంస్థలు తీసుకొస్తున్న 5 కొత్త ఎలక్ట్రిక్ కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 22, 2026, 10:30:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగాన్ని ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా క్యాప్చర చేస్తోంది! ఇప్పటివరకు ప్రీమియం, ఖరీదైన ఈవీ కార్లకే పరిమితమైన మార్కెట్, ఇప్పుడు మధ్యతరగతి వినియోగదారులకు సైతం అందుబాటులోకి రాబోతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు సరికొత్త బడ్జెట్​ ఈవీలతో ముందుకు వస్తున్నాయి.

ఇండియాలో త్వరలోనే ఈ టాప్-5 బడ్జెట్ ఈవీలు లాంచ్!
ఇండియాలో త్వరలోనే ఈ టాప్-5 బడ్జెట్ ఈవీలు లాంచ్!

భారత రోడ్లపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి హ్యుందాయ్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, రెనాల్ట్, వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థలు సరసమైన ధరల్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తున్నాయి. 2028 నాటికి ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న టాప్ 5 అఫర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇక్కడ పరిశీలిద్దాము..

1. హ్యుందాయ్ ‘HE1i’

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్, ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 'HE1i' అనే కోడ్‌నేమ్‌తో ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూపొందిస్తోంది. 2026 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి ఈ కారు విపణిలోకి రానుంది.

బాక్సీ డిజైన్‌తో పాటు క్యాబిన్‌లో ఎక్కువ స్థలం (క్యాబిన్ స్పేస్), అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద విండోస్, రూఫ్ రైల్స్‌తో ఇది పక్కా ట్రెడిషనల్ ఎస్‌యూవీ లుక్‌ను కలిగి ఉంటుంది. లోపల డ్యాష్‌బోర్డ్‌పై 9.9-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.9-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వనున్నారు. ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ టెక్నాలజీతో రానున్న ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. భద్రత కోసం లెవెల్-2 అడాస్ ఫీచర్‌ను కూడా అందించనున్నారు.

2. నెక్ట్స్-జెన్ టాటా నెక్సాన్.ఈవీ..

భారత ఈవీ విపణిలో రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్, తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తోంది. 2027 మధ్య నాటికి నెక్ట్స్ జనరేషన్ నెక్సాన్ ఐసీఈ మోడల్‌ను, ఆ తర్వాత కొద్దిరోజులకే నెక్సాన్.ఈవీని విడుదల చేయాలని భావిస్తోంది.

పూర్తిగా సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్, మరింత మెరుగైన బిల్డ్ క్వాలిటీ, అధునాతన క్యాబిన్ ఫీచర్లతో ఈ కారు రానుంది. అప్‌గ్రేడెడ్ అడాస్ సేఫ్టీ ఫీచర్లను ఇందులో చేర్చనున్నారు. అధునాతన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతతో రానున్న ఈ కొత్త నెక్సాన్.ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 525 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా మోటార్, బ్యాటరీ ప్యాక్‌ను తీర్చిదిద్దుతున్నారు.

3. రెనాల్ట్ బ్రిడ్జర్ ఈవీ..

ఫ్రెంచ్ ఆటో మేకర్ రెనాల్ట్, ఇండియాలో తన స్థానాన్ని బలపరచుకోవడానికి ‘బ్రిడ్జర్’ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. 2027 ద్వితీయార్థంలో దీని పెట్రోల్ మోడల్ రానుండగా, 2028 ప్రథమార్థంలో పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ 'బ్రిడ్జర్ ఈవీ' ని మార్కెట్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా తక్కువ ధరకే లభించే ఈవీలలో ఇది ఒకటిగా నిలిచే అవకాశముంది.

4. విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎక్స్..

భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్, భారతీయుల కోసం 'వీఎఫ్​ ఎక్స్' అనే కోడ్‌నేమ్‌తో సరికొత్త కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీని డెవలప్ చేస్తోంది. 2028 నాటికి ఈ కారు రోడ్లపైకి రానుంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 11.5 లక్షలు మాత్రమే ఉండేలా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ కంఫర్ట్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారనుంది.

5. మారుతీ సుజుకీ చవకైన ఎలక్ట్రిక్ కారు..

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా అఫర్డిబుల్ ఈవీ రేసులో నిలిచింది. రూ. 10 లక్షల కంటే తక్కువ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలోనే సరికొత్త స్మాల్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. 2028 నాటికి ఈ కారు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. ఎ-సెగ్మెంట్ విభాగంలో రానున్న ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 285 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. ఇది టాటా టియాగో.ఈవీకి సరైన పోటీదారుగా నిలవనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More