...
...
Next Story

Safest Cars : పిల్లల భద్రతలో ఈ కార్లు టాప్! ధర రూ. 20లక్షల లోపే..

Safest Cars for Kids : తమ కుటుంబం, ముఖ్యంగా పిల్లల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని భావించే పేరెంట్స్ కోసం భారత్ ఎన్​సీఏపీ రేటింగ్స్ ఆధారంగా అత్యంత సురక్షితమైన 5 కార్ల జాబితా ఇక్కడ ఉంది. చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో ఇవి అద్భుతమైన స్కోరు సాధించాయి.

Published on: May 11, 2026, 09:11:32 IST
Advertisement

కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉండే మొదటి ఆలోచన ‘భద్రత’. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు కారు ఎంత సురక్షితంగా ఉందనేది అత్యంత కీలకం. ఈ విషయంలో వాహనదారులకు అవగాహన కల్పించేందుకు భారత్ ఎన్​సీఏపీ క్రమం తప్పకుండా క్రాష్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 20 లక్షల లోపు బడ్జెట్‌లో, పిల్లల భద్రత (చైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్- సీఓపీ) విషయంలో అత్యుత్తమ రేటింగ్ సాధించిన ఐదు కార్ల వివరాలను ఇప్పుడు చూసేయండి. మీరు కారు కొనేటప్పుడు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.

1. కియా సెల్టోస్..

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ..
రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ..

భారత మార్కెట్​లో భారత్ ఎన్​సీఏపీ ద్వారా అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా కియా సెల్టోస్ గుర్తింపు పొందింది. పిల్లల భద్రత విభాగంలో ఈ కారు 49 పాయింట్లకు గానూ ఏకంగా 45 పాయింట్లు సాధించింది. డైనమిక్ టెస్టింగ్‌లో 24/24, చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్‌లో 12/12 పర్ఫెక్ట్ స్కోరు సాధించడం విశేషం. చిన్న పిల్లల డమ్మీలతో చేసిన ఫ్రంటల్, సైడ్ క్రాష్ పరీక్షల్లో ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చి 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

2. రెనాల్ట్ డస్టర్..

సురక్షితమైన కార్ల జాబితాలో రెనాల్ట్ డస్టర్ రెండో స్థానంలో నిలిచింది. ఇది కూడా చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 45/49 పాయింట్లతో 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ప్రమాద సమయాల్లో పిల్లల సీట్లను ఎంత పటిష్టంగా ఉంచుతుందో తెలిపే ‘డైనమిక్ ఎవాల్యుయేషన్’లో ఇది 24/24 స్కోరు సాధించి తన విశ్వసనీయతను నిరూపించుకుంది.

3. టాటా పంచ్ / పంచ్ ఈవీ..

మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత చేరువైన టాటా పంచ్, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ పంచ్ ఈవీ భద్రతలో తగ్గడం లేదు. ఇవి కూడా భారత్ ఎన్​సీఏపీ టెస్టుల్లో 45 పాయింట్లు సాధించాయి. చైల్డ్ సీట్లను సులభంగా, పటిష్టంగా అమర్చవచ్చని ఈ పరీక్షలు స్పష్టం చేశాయి. టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు కాగా, పంచ్ ఈవీ రూ. 9.69 లక్షల నుంచి అందుబాటులో ఉంది. బడ్జెట్‌లో సేఫ్ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

4. స్కోడా కైలాక్ ..

పెద్ద కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ వాహనాల్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ కారు కూడా పిల్లల భద్రతలో 45 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. టయోటా హైక్రాస్ ధర రూ. 19.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం..

ఒకవేళ మీరు ఆఫ్​-రోడ్ ప్రయాణాలను ఇష్టపడుతూ, కుటుంబ భద్రతను కూడా కోరుకుంటే.. మహీంద్రా థార్ రాక్స్​ను పరిశీలించవచ్చు. ఇది కూడా 45 పాయింట్లతో 5-స్టార్ రేటింగ్ సాధించింది. దీని ప్రారంభ ధర రూ. 12.39 లక్షలు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks