Safest SUV : టాటా సియెర్రా వర్సెస్​ కియా సెల్టోస్​- సేఫ్టీలో ఏ ఎస్​యూవీ బెస్ట్?

భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన భరత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలు వెలువడ్డాయి. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కియా సెల్టోస్, టాటా సియెర్రా.. రెండూ 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే, స్కోర్ల పరంగా చూస్తే కియా సెల్టోస్ స్వల్ప ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచింది.

Published on: Apr 1, 2026, 16:00:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సేఫ్టీ అనేది ఇప్పుడు భారత ఆటోమొబైల్​ కస్టమర్ల ప్రయారిటీ! ఫీచర్ల కొరత ఉన్నా, తమతో పాటు తమ ఫ్యామిలీ సేఫ్టీ విషయంలో మాత్రం ప్రజలు వెనకడుగు వేయడం లేదు. అందుకే చాలా మంది కారు కొనే ముందు సేఫ్టీ ఫీచర్లను, కార్​ క్రాష్​ టెస్ట్​ ఫలితాలను (సేఫ్టీ రేటింగ్​)ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా, కియా సెల్టోస్​ ఎస్​యూవీలపై ఇటీవలే భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ జరిగింది. ఈ రెండు ఎస్​యూవీలకు సంబంధించిన క్రాష్​ టెస్ట్​ ఫలితాలు, ఎందులో సేఫ్టీ ఎక్కువగా ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా వర్సెస్​ కియా సెల్టోస్​.,
టాటా సియెర్రా వర్సెస్​ కియా సెల్టోస్​.,

పాయింట్ల పరంగా సెల్టోస్ ముందంజ..

ఓవరాల్ స్కోర్లను గమనిస్తే, కియా సెల్టోస్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 32 పాయింట్లకు గాను 31.70 సాధించగా, టాటా సియెర్రా 31.14 పాయింట్లు పొందింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో కూడా సెల్టోస్ 45/49 పాయింట్లతో, సియెర్రా సాధించిన 44.73 కంటే స్వల్పంగా ముందంజలో ఉంది. ఈ స్వల్ప తేడాలే సెల్టోస్‌ను పేపర్ మీద మరింత శక్తివంతమైన కారుగా నిలబెట్టాయి.

టాటా సియెర్రా వర్సెస్​ కియా సెల్టోస్​- అడల్ట్ సేఫ్టీ..

పెద్దల భద్రత విషయంలో పాయింట్ల తేడా రావడానికి ప్రధాన కారణం 'ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మబుల్ బారియర్ టెస్ట్'.

కియా సెల్టోస్: శరీరంలోని దాదాపు అన్ని కీలక భాగాలకు 'గుడ్' (చాలా మంచి) రక్షణ కల్పించింది. డ్రైవర్ కింది కాళ్లకు మాత్రమే రక్షణ 'అడిక్వేట్' (పర్వాలేదు)గా నమోదైంది.

టాటా సియెర్రా: డ్రైవర్ ఛాతీ భాగం వద్ద రక్షణ విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ఇక్కడ రక్షణ తక్కువగా ఉండటంతో పాయింట్లు తగ్గాయి. అధిక వేగంతో జరిగే ప్రమాదాల్లో ఛాతీ రక్షణ అత్యంత కీలకం కావడంతో సెల్టోస్‌కు ఇక్కడ ఎడ్జ్ లభించింది.

సైడ్ ఇంపాక్ట్: అయితే పక్క నుంచి జరిగే ప్రమాదాల్లో మాత్రం రెండు ఎస్‌యూవీలు సమానంగా 'గుడ్' రేటింగ్‌ను పొందాయి.

Electric Car : విన్​ఫాస్ట్​ నుంచి 7 సీటర్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు- త్వరలోనే ఇండియాలో లాంచ్..

టాటా సియెర్రా వర్సెస్​ కియా సెల్టోస్​- చైల్డ్ సేఫ్టీ..

పిల్లల రక్షణలో రెండు కార్లు సీఆర్​ఎస్​ ఇన్‌స్టాలేషన్‌లో 12/12, వెహికల్ అసెస్‌మెంట్‌లో 9/13 పాయింట్లతో సమానంగా నిలిచాయి. తేడా ఎక్కడ వచ్చిందంటే:

డైనమిక్ టెస్ట్: సెల్టోస్ 24/24 పర్ఫెక్ట్ స్కోర్ సాధించగా, సియెర్రా 23.73 స్కోర్ చేసింది. 18 నెలల చిన్నారి డమ్మీపై చేసిన ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో సియెర్రా స్వల్పంగా పాయింట్లు కోల్పోయింది. అయితే 3 ఏళ్ల వయసు పిల్లల రక్షణలో రెండు కార్లు అద్భుతంగా పనిచేస్తాయి.

టాటా సియెర్రా వర్సెస్​ కియా సెల్టోస్​- సేఫ్టీ ఫీచర్లు..

ఫీచర్ల పరంగా చూస్తే రెండు కార్లు పోటాపోటీగా ఉన్నాయి. రెండింటిలోనూ:

6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ఎయిడ్స్ (ఈఎస్​సీ).

360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్.

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్.

అత్యంత ముఖ్యమైన లెవల్-2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్).

హిల్ స్టార్ట్ అసిస్ట్, డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉన్నాయి.

మొత్తానికి, భద్రతా ప్రమాణాల పరంగా కియా సెల్టోస్, టాటా సియెర్రా రెండూ ఈ సెగ్మెంట్లో మేటి కార్లుగా నిలిచాయి. అయినప్పటికీ, క్రాష్ టెస్ట్ స్కోర్లలో కియా సెల్టోస్ స్వల్ప ఆధిక్యతతో 'నెంబర్ వన్' స్థానాన్ని కైవసం చేసుకుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More