ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా ప్రమాణాలను అంచనా వేసే ప్రఖ్యాత సంస్థ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ).. 'సబ్జెక్ట్ వారీగా ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ 2026'ను ఇటీవలే విడుదల చేసింది. బోధన, పరిశోధన, విజ్ఞానం, అంతర్జాతీయ దృక్పథం వంటి 18 కఠినమైన ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. గ్లోబల్ స్థాయిలో అమెరికా, బ్రిటన్ వర్సిటీల హవా కొనసాగినప్పటికీ, పలు కీలక విభాగాల్లో భారతీయ విద్యాసంస్థలు తమ ముద్ర వేయడం విశేషం.
సబ్జెక్టుల వారీగా భారత్ నుంచి టాప్-3 వర్సిటీలు ఇవే:

1. కంప్యూటర్ సైన్స్: ఈ విభాగంలో భారత్ నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ స్థాయిలో ఇది 96వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో అమిటీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా నిలిచాయి.
2. ఇంజనీరింగ్: ఇంజనీరింగ్ రంగంలోనూ ఐఐఎస్‌సీ బెంగళూరు (ప్రపంచ ర్యాంకు 201-250) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రెండో స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ), మూడో స్థానంలో గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ నిలిచాయి.
3. బిజినెస్ అండ్ ఎకనామిక్స్: వ్యాపార, ఆర్థిక విద్యా విభాగాల్లో నోయిడాకు చెందిన అమిటీ యూనివర్సిటీ దేశంలోనే ఉత్తమ వర్సిటీగా నిలిచింది. దీని తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీలు ఉన్నాయి.
4. మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్: వైద్య విభాగంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ ద్వితీయ స్థానంలో, అమిటీ యూనివర్సిటీ తృతీయ స్థానంలో నిలిచాయి.
5. లా: న్యాయశాస్త్ర విభాగంలో భారత్ నుంచి కేవలం రెండు వర్సిటీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలవగా, దిల్లీ యూనివర్సిటీ రెండో స్థానంలో నిలిచింది.
6. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్: సాహిత్యం, కళల విభాగంలో దిల్లీ యూనివర్సిటీ అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), జాదవ్‌పూర్ యూనివర్సిటీలు నిలిచాయి.
{{/usCountry}}6. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్: సాహిత్యం, కళల విభాగంలో దిల్లీ యూనివర్సిటీ అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), జాదవ్‌పూర్ యూనివర్సిటీలు నిలిచాయి.
{{/usCountry}}7. సైన్స్ విభాగాలు (లైఫ్- ఫిజికల్ సైన్స్): లైఫ్ సైన్సెస్ విభాగంలో బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) మొదటి స్థానంలో నిలవగా, ఫిజికల్ సైన్సెస్‌లో ఐఐఎస్‌సీ బెంగళూరు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సైన్స్ రంగంలో భారత్ నుంచి పరిశోధనలు పుంజుకుంటున్నాయని ఈ ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.
8. సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్: సైకాలజీలో దిల్లీ యూనివర్సిటీ, సోషల్ సైన్సెస్‌లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మొదటి స్థానాల్లో నిలిచి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి.
విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ర్యాంకింగ్స్ భారతీయ వర్సిటీలలో మారుతున్న బోధనా పద్ధతులను, పెరుగుతున్న పరిశోధనా నాణ్యతను ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ వేదికపై మన వర్సిటీలు పోటీ పడుతుండటం హర్షించదగ్గ పరిణామం.