కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొననాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 5 రోజులపాటు దాడులు ఆపనున్నట్టుగా తెలిపారు. సమగ్ర పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్‌లు చర్చలు జరిపాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఈ చర్చల ఫలితంగా ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్‌ఫ్రాపై మిలటరీ స్ట్రైక్స్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు. శనివారం రాత్రి హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చారు. లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను అమెరికా తుడిచిపెట్టేస్తుందని హెచ్చరించారు.
'పశ్చిమాసియాలో యుద్ధం పూర్తిగా ఆపేసే విషయం మీద ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు ఐదు రోజుల వరకు వాయిదా వేసేందుకు బలగాలను ఆదేశించాం. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఫలితంపై ఆధారపడి భవిష్యత్ పరిస్థితులు ఉంటాయి.' అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటన చేశారు.
కొన్ని రోజులుగా తీవ్రమవుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ గట్టిగా స్పందిస్తూ.. తమ మౌలిక మౌలిక సదుపాయాలపై ఏ దాడి జరిగినా దాని ఫలితంగా మొత్తం గల్ఫ్ ప్రాంతం నష్టపోతుందని పేర్కొంది. తమ విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటే, గల్ఫ్ దేశాల్లోని కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాల్లోని ఇంధన సంస్థాపనలే తమ లక్ష్యాలుగా ఉంటాయని తెలిపింది. అంతేకాదు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని కూడా ఇరాన్ బెదిరించింది.
ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి, ప్రపంచంలోని ప్రధాన సముద్ర మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు, గ్యాస్‌లో సుమారు చాలా వరకు దీని గుండానే రవాణా అవుతుంది.
{{/usCountry}}ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి, ప్రపంచంలోని ప్రధాన సముద్ర మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు, గ్యాస్‌లో సుమారు చాలా వరకు దీని గుండానే రవాణా అవుతుంది.
{{/usCountry}}ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్‌పై సైనిక చర్యను ప్రారంభించాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హోర్ముజ్ గుండా నౌకల రాకపోకలను నిరోధించింది. దీనివల్ల ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇరాన్ తీసుకున్న ఈ చర్య చమురు, గ్యాస్ ట్యాంకర్ల రాకపోకలను ప్రభావితం చేసింది. ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.