10లక్షల సేల్స్ మైలురాయిన అందుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి దిగ్గజ 2 వీలర్ ఆటోమొబైల్ సంస్థ కీలక అప్డేట్ చేసింది. బడ్జెట్ ధరలో రేంజ్ కోరుకునే వాహనదారుల కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సరికొత్త 2.3 kWh బ్యాటరీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రూ.1,16,310 (ల్లీ ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో విక్రయించిన 2.2 kWh బేస్ మోడల్ స్థానంలో ఈ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టారు.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ప్రతిరోజూ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వెళ్లేవారికి పెట్రోల్ ఖర్చులు ఆదా చేసుకునేందుకు ఈ మోడల్ అనుకూలంగా ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే ధర వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, రేంజ్ గణనీయంగా పెరగడం వాహనదారులకు పెద్ద ఊరట.
పెరిగిన బ్యాటరీ సామర్థ్యం.. ఎక్కువ రేంజ్!
ఈ కొత్త టీవీఎస్ ఐక్యూబ్‌లో చేసిన ప్రధాన మార్పు దాని బ్యాటరీ ప్యాక్. గతంలో ఉన్న 2.2 kWh బ్యాటరీకి బదులుగా 2.3 kWh సామర్థ్యం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ (ఐడీసీ) ప్రమాణాల ప్రకారం.. ఈ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌పై 115 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 21 కిలోమీటర్ల అదనపు రేంజ్ అందిస్తుంది. సాధారణ 950డబ్ల్యూ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి 2 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది.
వేగం తగ్గినా స్మార్ట్ ఫీచర్ల హంగామా..
రేంజ్ పెంచే క్రమంలో టీవీఎస్ ఇంజనీర్లు ఈ వాహన గరిష్ట వేగాన్ని కొంత తగ్గించారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్‌లో గంటకు 75 కిలోమీటర్ల వేగం ఉండగా, కొత్త వేరియంట్‌లో గరిష్ట వేగాన్ని 68 కేఎంపీహెచ్‌గా నిర్ణయించారు. అలాగే, డిస్‌ప్లే కన్సోల్ విషయంలో గతంలో ఇచ్చిన టీఎఫ్‌టీ స్క్రీన్ స్థానంలో కొత్తగా 5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను చేర్చారు.
డిస్‌ప్లే మారినప్పటికీ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్/ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు, రివర్స్ మోడ్, ఓటీఏ సాఫ్ట్వేర్ అప్డేట్స్, జియో-ఫెన్సింగ్ వంటి సాంకేతిక సౌకర్యాలను సంస్థ అలాగే కొనసాగించింది.
సాంకేతిక వివరాలు.. ఆకట్టుకునే రంగులు
{{/usCountry}}డిస్‌ప్లే మారినప్పటికీ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్/ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు, రివర్స్ మోడ్, ఓటీఏ సాఫ్ట్వేర్ అప్డేట్స్, జియో-ఫెన్సింగ్ వంటి సాంకేతిక సౌకర్యాలను సంస్థ అలాగే కొనసాగించింది.
సాంకేతిక వివరాలు.. ఆకట్టుకునే రంగులు
{{/usCountry}}ఇంజిన్ హార్డ్‌వేర్ విభాగంలో ఇతర మార్పులేవీ చేయలేదు. ఇందులో 3.68 kW సామర్థ్యం ఉన్న హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 140 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రయాణంలో సౌకర్యం కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లతో పాటు రెండు చక్రాలకూ డ్రమ్ బ్రేకుల అమరికను అందించారు. ఈ సరికొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టైటానియం గ్రే, వాల్‌నట్ బ్రౌన్, పెర్ల్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు లభిస్తుంది.
మరి మీరు ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొంటున్నారా?