Electric scooters : టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగబడి కొంటున్న భారతీయులు! సేల్స్‌లో టాప్..
భారత ఈవీ ద్విచక్ర వాహన విపణిలో ఆగస్టు నెల విక్రయాల గణాంకాలు విడుదలయ్యాయి. టీవీఎస్ మోటార్ అత్యధిక మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలవగా, బజాజ్ ఆటో గట్టి పోటీనిచ్చింది. బ్రాండ్ వారీ నివేదిక ఇక్కడ చూడండి..
భారతదేశంలో విద్యుత్ ద్విచక్ర వాహనాల విక్రయాలు శరవేగంగా పుంజుకుంటున్నాయి. పెట్రోల్ ధరల భారం, పర్యావరణ స్పృహ పెరుగుతుండటంతో వినియోగదారులు ఈ-స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక కొత్తగా విడుదలైన వాహన రిజిస్ట్రేషన్ల డేటా ప్రకారం.. 2026 ఆగస్టు నెలలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే సమయంలో బజాజ్, ఏథర్ వంటి సంస్థలు కూడా (వార్షిక ప్రాతిపదికన) భారీ వృద్ధిని నమోదు చేసి మార్కెట్ పోటీని మరింత వేడెక్కించాయి.

టీవీఎస్ అగ్రస్థానం.. ఐక్యూబ్, ఆర్బిటర్ హవా!
ఆగస్టు 2026లో టీవీఎస్ మోటార్ మొత్తం 48,873 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టులోని 25,546 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 91 శాతం వార్షిక వృద్ధి. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ అత్యధికంగా 27 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీకి చెందిన ఐక్యూబ్, కొత్తగా వచ్చిన ఆర్బిటర్ మోడళ్లు ఈ భారీ విక్రయాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే, జులై నెలలో నమోదైన అమ్మకాలతో పోల్చితే ఆగస్టు సేల్స్‌లో స్వల్ప క్షీణత కనిపించింది.
రెండో స్థానంలో బజాజ్.. గ్యాప్ తగ్గించిన చేతక్!
బజాజ్ ఆటో తన ఐకానిక్ ‘చేతక్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టులో బజాజ్ 41,019 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఆగస్టులో నమోదు చేసిన 12,246 యూనిట్లతో పోలిస్తే ఇది మైండ్ బ్లోయింగ్ అనిపించేలా 235 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. దీనితో బజాజ్ తన మార్కెట్ వాటాను 22 శాతానికి పెంచుకుని టీవీఎస్‌కు అతిసమీపంలోకి వచ్చింది. కాగా జులై విక్రయాలతో పోలిస్తే నెలవారీ సేల్స్ తగ్గాయి.
ఏథర్, హీరో విడా రేసు.. క్షీణించిన ఓలా సెల్స్!
ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఆగస్టులో 28,708 యూనిట్ల విక్రయాలతో 16 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఇది 49 శాతం వార్షిక వృద్ధి కాగా, జులై (30,636 యూనిట్లు)తో పోలిస్తే 6శాతం తగ్గింది.
హీరో మోటోకార్ప్ ‘విడా’ బ్రాండ్ 18,978 యూనిట్లను విక్రయించి 38 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జులై అమ్మకాలతో (22,989) పోలిస్తే 17 శాతం తగ్గినా, 10 శాతం మార్కెట్ వాటాతో నిలకడగా రాణిస్తోంది.
అయితే, ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ విక్రయాలు మళ్లీ మందగించాయి. ఆగస్టులో కేవలం 13,849 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29 శాతం, జులై నెలతో పోలిస్తే 3 శాతం క్షీణతను చూపడం గమనార్హం.
ఇతర బ్రాండ్ల ప్రదర్శన ఇలా..
గ్రీవ్స్ ఈ-మోబిలిటీ: 8,612 యూనిట్ల విక్రయాలతో 89 శాతం వార్షిక వృద్ధిని, 5 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
రివర్ మోబిలిటీ: 'ఇండీ' ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు 170 శాతం పెరిగి 5,134 యూనిట్లకు చేరాయి.
బిగాస్ ఆటో: 180 శాతం వృద్ధితో 4,844 యూనిట్లను నమోదు చేసి 3 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
సింపుల్ ఎనర్జీ అండ్ మోటోవోల్ట్: సింపుల్ ఎనర్జీ 1,635 యూనిట్లు (122% వృద్ధి) దాటగా, మోటోవోల్ట్ మోబిలిటీ ఏకంగా 509 శాతం వార్షిక వృద్ధితో 1,365 యూనిట్లను విక్రయించింది.
కొత్త మోడళ్లపైనే ఆశలు..
పండుగల సీజన్ సమీపిస్తుండటంతో సంస్థలన్నీ సరికొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. ఏథర్ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన ‘కోనార్క్’, అలాగే సింపుల్ ఎనర్జీకి చెందిన ‘వేవ్’ స్కూటర్లు రాబోయే నెలల్లో కంపెనీల సేల్స్ గ్రాఫ్‌ను మరింత పైకి తీసుకెళతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


