...
...
Next Story

తమిళనాడులో ఘోర ప్రమాదం- రెండు బస్సులు ఢీ! ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంకాసి జిల్లాలో రెండు ప్రైవేట్​ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 20కిపైగా మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Published on: Nov 24, 2025, 12:21:12 IST
Advertisement

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది! టెంకాసి జిల్లాలోని ఇడైకల్​ కామరాజపురం వద్ద సోమవారం ఉదయం రెండు ప్రైవేట్​ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు.

ఘటనాస్థలంలో దృశ్యాలు..
ఘటనాస్థలంలో దృశ్యాలు..

పోలీసుల సమాచారం ప్రకారం.. మదురై నుంచి శెంకోట్టై వైపు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్‌పట్టి వైపు వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనాస్థలానికి పరుగులు తీసిన స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్రేన్​ సాయంతో వాటిని పక్కకు తొలగించాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

డ్రైవర్​ నిర్లక్ష్యమే కారణం!

మదురై నుంచి శెంకోట్టై వైపు వెళుతున్న కైసర్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

గాయపడిన 28 మంది ప్రయాణికులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఘటనాస్థలంలో ఉన్న అధికారులు తెలిపారు.

పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks