గ్లోబల్ రైడ్-షేరింగ్, డెలివరీ దిగ్గజం ఉబెర్ (Uber) సంస్థలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3,300 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. సంస్థలో అంతర్గత నిర్వహణ పొరలను (Layers) తగ్గించి, బృందాల నిర్మాణాన్ని సరళతరం చేయడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు. స్థానిక చట్టపరమైన నిబంధనలు ఉన్న దేశాల్లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లో బాధితులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
సంస్థ పునర్నిర్మాణానికే ఈ నిర్ణయం

గత ఐదేళ్లలో ఉబర్ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. కంపెనీ రాబడి దాదాపు మూడు రెట్లు పెరిగినప్పటికీ, ఆ వృద్ధితో పాటు సంస్థలో ఆర్గనైజేషనల్ సంక్లిష్టత కూడా పెరిగింది. అనవసరపు మేనేజ్‌మెంట్ చట్రాలు, కోఆర్డినేషన్ కమిటీల వల్ల నిర్ణయాల ప్రక్రియ ఆలస్యమవుతోందని సీఈఓ అభిప్రాయపడ్డారు.
"ఇది ఉద్యోగుల పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదు. కంపెనీ రూపురేఖలు, ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నాం" అని దారా ఖోస్రోషాహి వివరించారు. ఉద్యోగుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను డ్రైవర్లు, కొరియర్లు, వ్యాపారుల పురోగతితో పాటు అటానమస్ (రోబోట్యాక్సీ) సాంకేతికతపై మరింతగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు.
మెమోలోని కీలక అంశాలివే
మేనేజ్‌మెంట్ వ్యవస్థల తగ్గింపు: సీఈఓ పదవికి 7 లేదా అంతకంటే ఎక్కువ స్థానాల దూరంలో (7+ layers) ఉన్న ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర తగ్గించారు. 1-2 మంది మాత్రమే నివేదించే 'మైక్రో టీమ్స్'ను దాదాపు 50 శాతం వరకు కుదించారు.
విభాగాల విలీనం: డెలివరీ విభాగంలో విడివిడిగా ఉన్న రెస్టారెంట్స్, రిటైల్, డైరెక్ట్ ఆపరేషన్స్ టీమ్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. టెక్నాలజీ విభాగంలో కోర్ సర్వీసెస్ ఇంజినీరింగ్, సైన్స్ బృందాలను విలీనం చేశారు.
రిమోట్ వర్క్ రద్దు: ఇకపై కేవలం 1 శాతం మంది ఉద్యోగులు మాత్రమే 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే వెసులుబాటు ఉంటుంది. మిగిలిన వారంతా వారానికి కనీసం 3 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గ్లోబల్ టీమ్‌లు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయాల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో కలకలం
{{/usCountry}}రిమోట్ వర్క్ రద్దు: ఇకపై కేవలం 1 శాతం మంది ఉద్యోగులు మాత్రమే 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే వెసులుబాటు ఉంటుంది. మిగిలిన వారంతా వారానికి కనీసం 3 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గ్లోబల్ టీమ్‌లు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయాల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో కలకలం
{{/usCountry}}ఉబర్ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. "నా మిత్రులైన ప్రతిభావంతులైన ప్రొడక్ట్ డిజైనర్లు ఉద్యోగాలు కోల్పోయారు" అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేయగా.. "ఈ లేఆఫ్స్ ఎప్పుడు ముగుస్తాయి? నైపుణ్యం ఉన్న ఇంజినీర్లను కూడా తొలగిస్తున్నారు" అని మరొకరు కామెంట్ చేశారు. ఉబెర్ రోబోట్యాక్సీ ప్రాజెక్ట్‌పై 10 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధపడుతోందని, అందుకోసమే మానవ వనరులపై వేటు వేస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.