...
...
Next Story

తెలంగాణకు శుభవార్త - రూ. 3 వేల కోట్లతో హైవే ప్రాజెక్ట్, కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ - పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడేబల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు రోడ్డు విస్తరించనున్నారు. ఇందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి (NH-167)ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ. 3,175 కోట్లు కేటాయించనున్నారు.

Published on: Feb 14, 2026, 18:08:41 IST
Advertisement

తెలంగాణకు కేంద్రం మరోసారి శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్‌నగర్ మధ్య రూ. 3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 80 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసల ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 3,175 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించారు.

తెలంగాణకు కేంద్రం శుభవార్త
తెలంగాణకు కేంద్రం శుభవార్త

హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. రాయచూర్, రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు ఉన్న ఈ కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల ఈ ప్రాంతంలో ఆర్థికపరమైన రంగాలతో పాటు లాజిస్టిక్స్ రంగాలు గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

4 లైన్ల హైవేగా విస్తరణ…

ప్రస్తుతం గుడే బెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ (జాతీయ రహదారి (NH 167 ) మధ్య ఉన్న కనెక్టివిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణాలు చాలా ఆలస్యంగా ఉంటున్నాయి. ఈ రోడ్డు గుడే బెల్లూర్, మగ్నూర్, మక్తల్, మర్రికల్, దేవరకద్ర, జక్లైర్, యలిగండ్ల, బందర్పల్లి గుండా వెళుతుంది. ఇలాంటి పట్టణాల మీదుగా వెళ్తే ఈ హైవేను విస్తరించాలని కేంద్రం నిర్మయించింది. ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను పరిష్కరించడానికి… 4 లైన్ల హైవేగా అభివృద్ధి చేయనున్నారు.

ఈ తాజా హైవే ప్రాజెక్ట్ తో తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల కు చెప్పుకోదగ్గ ప్రయోజనం అందే అవకాశం ఉంది. ముఖ్యంగా లాజిస్టిక్ రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది, లాజిస్టిక్స్ ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచుతుంది.

  • హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లో భాగంగా గుడేబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు NH-167ను 4-లేన్లుగా విస్తరిస్తారు.క
  • రోడ్డు విస్తరణకు అయ్యే వ్యయం - రూ. 3,175.08 కోట్లు
  • విస్తరించే కి.మీ పరిధి - 80.01 కి.మీ
  • ఈ రోడ్డు విస్తరణతో సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది.
  • నారాయణపేట మరియు మహబూబ్‌నగర్ జిల్లాలలో కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
  • NH-150 మరియు NH-167Nలను అనుసంధానించడం ద్వారా ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ నోడ్‌లను ఏకీకృతమవుతాయి. ఇది వాణిజ్యాన్ని పెంచుతుంది.
  • ప్రస్తుతం ఈ రోడ్డుపై జర్నీకి 3 గంటలు పడుతుండగా… విస్తరణతో గంటర్నరకు తగ్గుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks