ISRO Recruitment 2026 : టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి 'ఇస్రో' నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలు, వివరాలివే

ISRO URSC Recruitment 2026 : ఇస్రోకి చెందిన యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ సెంటర్‌లో 61 టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు నవంబరు 13, 2026 వరకు ursc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 28, 2026, 07:09:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ISRO URSC Recruitment 2026 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కి చెందిన ప్రతిష్ఠాత్మక యు ఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (URSC) ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యుఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ursc.gov.in ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇస్రో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
ఇస్రో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియడానికి చివరి తేదీ నవంబరు 13, 2026. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, ఎంపిక విధానం మరియు రుసుము వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.

  • టెక్నీషియన్ బీ : 46 పోస్టులు
  • లైట్ వెహికల్ డ్రైవర్ : 5 పోస్టులు
  • హెవీ వెహికల్ డ్రైవర్ : 10 పోస్టులు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు సమర్పించిన విద్యా అర్హతలు, మార్కులు మరియు ఇతర వివరాల ఆధారంగా మొదట ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు.

ఈ స్క్రీనింగ్‌లో ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ, ఇస్రో/యుఆర్‌ఎస్సీ నిర్ణయించిన కటాఫ్ నిబంధనలు మరియు ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను తదుపరి దశ అయిన స్కిల్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు.

అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు కింద రూ. 500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ. 400 మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లోకి రీఫండ్ చేస్తారు. వాస్తవ నాన్-రీఫండబుల్ దరఖాస్తు రుసుము రూ. 100 మాత్రమే. రాత పరీక్షకు హాజరుకాని వారికి ఎలాంటి నగదు రీఫండ్ లభించదు.

దరఖాస్తు రుసుమును కేవలం ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ (DD), చెక్కులు, నగదు, మనీ ఆర్డర్ లేదా పోస్టల్ ఆర్డర్ల రూపంలో ఇచ్చే రుసుములను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. రాత పరీక్ష తేదీలు, సిలబస్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా యుఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More