అమెరికాలో ఉద్యోగం చేయాలనే విదేశీ నిపుణుల ఆశలను ఆసరాగా చేసుకుని సాగుతున్న హెచ్-1బీ వీసా అక్రమాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ కంపెనీలు, బోగస్ ఉద్యోగాలు, షెల్ ఆఫీసుల ద్వారా సాగుతున్న అక్రమ వ్యాపారాన్ని అంతమొందించేందుకు అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశీ ఉద్యోగులను తీవ్రంగా దోపిడీ చేస్తున్న నెట్‌వర్క్‌లను ఏరివేసేందుకు తనిఖీలు, దాడులు ముమ్మరం చేసింది.
తత్వాలు మారవు.. సంకెళ్లు సిద్ధం : ఐజీ ఆంథోనీ ఘాటు హెచ్చరిక
అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆంథోనీ డి'ఎస్పోసిటో సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా హెచ్-1బీ అక్రమార్కులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. హెచ్-1బీ వీసా రూపంలో బ్యాక్ డోర్ నుంచి సాగుతున్న దొంగదారులను మూసివేస్తున్నామని తెలిపారు.
"సరిహద్దు భద్రత అంటే ప్రతి ద్వారాన్ని మూసివేయడమే. హెచ్-1బీ దొంగదారిని కూడా బంద్ చేస్తున్నాం. నకిలీ యజమానులు, బోగస్ ఉద్యోగాలు, వీసా మిల్లులు, ఉద్యోగుల దోపిడీకి ఇక కాలం చెల్లింది. చట్టాల్లోని వెసులుబాట్లను రద్దు చేస్తున్నాం. దాడులు నిజంగానే జరుగుతాయి.. అరెస్టులకు సంకెళ్లు సిద్ధంగా ఉన్నాయి" అని ఆంథోనీ డి'ఎస్పోసిటో స్పష్టం చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో 'అమెరికా ఫస్ట్' అంటే అమెరికన్ కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడమేనని ఆయన గుర్తుచేశారు.
డల్లాస్‌లో దిమ్మతిరిగే నిజాలు: ఖాళీ భవనాలు.. వందల వీసాలు
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్మిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ నేతృత్వంలోని బృందం గత ఆగస్టులో టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
ఒకే బహుళ అంతస్తుల భవనం చిరునామాతో ఏకంగా 500కు పైగా ఆమోదించిన హెచ్-1బీ అప్లికేషన్లు ముడిపడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ భవనంలో సోదాలు చేయగా మెజారిటీ కార్యాలయాలు తాళాలు వేసి, లైట్లు ఆర్పివేసి ఉన్నాయి. కనీసం వ్యాపార కార్యకలాపాలు సాగుతున్న ఆధారాలు కూడా కనిపించలేదు. పేపర్‌పై మాత్రమే కంపెనీలు సృష్టించి, వీసాలు అమ్ముకుంటున్న దందాను అధికారులు నిర్ధారించుకున్నారు.
భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉండనుంది?
అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో పనిచేస్తున్న 'టాస్క్ ఫోర్స్ టు ఎలిమినేట్ ఫ్రాడ్'తో కలిసి ఈ దాడులను వేగవంతం చేస్తోంది. నకిలీ అప్లికేషన్లు వేయడం, జీతాల్లో కోతలు పెట్టడం (వేజ్ కిక్బ్యాక్స్), విదేశీ ఉద్యోగులను తక్కువ జీతాలకు పిలిపించి అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేయడంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
{{/usCountry}}అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో పనిచేస్తున్న 'టాస్క్ ఫోర్స్ టు ఎలిమినేట్ ఫ్రాడ్'తో కలిసి ఈ దాడులను వేగవంతం చేస్తోంది. నకిలీ అప్లికేషన్లు వేయడం, జీతాల్లో కోతలు పెట్టడం (వేజ్ కిక్బ్యాక్స్), విదేశీ ఉద్యోగులను తక్కువ జీతాలకు పిలిపించి అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేయడంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
{{/usCountry}}అమెరికా హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో అత్యధికులు (70 శాతానికి పైగా) భారతీయులే ఉంటారు. ఈ నేపథ్యంలో నిజమైన ప్రతిభ, అర్హతలతో, నిబంధనలకు లోబడి పనిచేసే భారతీయ నిపుణులకు ఈ తనిఖీల వల్ల ఎలాంటి ముప్పు ఉండదు. అయితే, అడ్డదారుల్లో నకిలీ కంపెనీల ద్వారా వీసా పొందిన వారు, బోగస్ జాబ్ ఆఫర్లతో అమెరికా వచ్చిన వారు మాత్రం కఠినమైన క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
క్రిమినల్ కేసులు, బ్లాక్‌లిస్ట్ చర్యలు
నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై కార్మిక శాఖ ఇప్పటికే ప్రత్యేక జాబితాలను సిద్ధం చేసింది. విచారణలో నేరం రుజువైతే సదరు సంస్థలను శాశ్వతంగా హెచ్-1బీ ప్రోగ్రామ్ నుంచి తొలగించడంతో పాటు (డిబార్‌మెంట్) క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని ఐజీ ఆంథోనీ హెచ్చరించారు.