అమెరికా బిజినెస్ స్కూళ్లలో ఉన్నత చదువులు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కఠిన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల నేపథ్యంలో వ్యక్తమవుతున్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (GMAC) విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం.. 2028 విద్యాసంవత్సరానికి గాను అమెరికాలోని ఫుల్ టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లకు వచ్చే దరఖాస్తులు ఏకంగా 27 శాతం తగ్గగా, విదేశీ విద్యార్థుల దరఖాస్తులు 38 శాతానికి పైగా క్షీణించాయి.
విదేశీ దరఖాస్తుల్లోనే తీవ్ర క్షీణత

అమెరికాలోని గ్రాడ్యుయేట్ బిజినెస్ ప్రోగ్రామ్‌లలో దేశీయ (అమెరికన్) విద్యార్థుల దరఖాస్తులు 6 శాతం మాత్రమే తగ్గగా, అంతర్జాతీయ విద్యార్థుల అప్లికేషన్లు ఏకంగా 38 శాతం మేర పడిపోయాయి. కేవలం క్రమబద్ధమైన ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్సులే కాకుండా, ఆన్‌లైన్ ఎంబీఏతో సహా వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనూ ఇదే తరహా మందగమనం కనిపిస్తోంది. అమెరికాలో బిజినెస్ ఎడ్యుకేషన్ పట్ల విదేశీ విద్యార్థులలో ఆసక్తి తగ్గుతోదనడానికి ఇది స్పష్టమైన సూచికగా నిలుస్తోంది.
ప్రముఖ వర్సిటీల్లో చేరికల కొరత
అమెరికాలోని టాప్ బిజినెస్ స్కూళ్లు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి. యూసీఎల్ఏ (UCLA) అండర్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో దరఖాస్తులు 21 శాతం తగ్గగా, జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన మెక్‌డోనో స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 22 శాతం క్షీణత నమోదైంది. డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఇదే తరహా తగ్గుదలను నమోదు చేసింది.
"యూసీఎల్ఏ అండర్సన్ స్కూల్‌లో అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తులు దాదాపు 30 శాతం పడిపోగా, అమెరికా విద్యార్థుల దరఖాస్తులు 10 శాతం మేర తగ్గాయి" అని ఆ సంస్థ ఫుల్ టైమ్ ఎంబీఏ అసోసియేట్ డీన్ గ్యారీ ఫ్రేజర్ వెల్లడించారు.
ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల సంఖ్య కూడా బాగా పడిపోయింది. ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో క్రితం ఏడాది 106 మంది విద్యార్థులు చేరగా, ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయి 57 వద్దకే పరిమితమైంది.
వీసా చిక్కులు.. ఆర్థిక సాయం లేదు
{{/usCountry}}ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల సంఖ్య కూడా బాగా పడిపోయింది. ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో క్రితం ఏడాది 106 మంది విద్యార్థులు చేరగా, ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయి 57 వద్దకే పరిమితమైంది.
వీసా చిక్కులు.. ఆర్థిక సాయం లేదు
{{/usCountry}}అడ్మిషన్ సాధించినప్పటికీ విద్యార్థి వీసాలు పొందడంలో విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజినెస్ స్కూళ్ల ప్రతినిధులు తెలిపారు. వీసాతో పాటు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సాయం (ఫైనాన్షియల్ ఎయిడ్) అందించడంలో ఎదురవుతున్న పోటీ కూడా విద్యార్థుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఎక్కువ ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంస్థల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.
అమెరికాలో దరఖాస్తులు దాదాపు 38 శాతం పడిపోగా, యూరోపియన్ బిజినెస్ స్కూళ్లలో దరఖాస్తుల క్షీణత కేవలం 2 శాతానికే పరిమితం కావడం గమనార్హం.
కొన్ని చోట్లా భిన్నమైన పరిస్థితులు
కొన్ని ప్రతిష్టాత్మక బీ-స్కూళ్లలో మాత్రం విదేశీ విద్యార్థుల శాతం కొంత నిలకడగా ఉంది. డార్ట్‌మౌత్స్ టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విదేశీ విద్యార్థుల వాటా 7 శాతం పెరిగి 29 శాతానికి చేరింది. యూసీఎల్ఏ అండర్సన్ స్కూల్‌లో దరఖాస్తులు తగ్గినప్పటికీ విదేశీ విద్యార్థుల వాటా స్వల్పంగా పెరిగి 36 శాతానికి చేరింది. మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో 65 దేశాలకు చెందిన 203 మంది అంతర్జాతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవడంలో అమెరికా బిజినెస్ స్కూళ్లు మునుపెన్నడూ లేని సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.