అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులు, వారికి స్పాన్సర్ చేసే కంపెనీలకు అమెరికా కార్మిక శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్) గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ నవంబర్ 16న కీలక ప్రతిపాదనలను ప్రకటించింది. అమెరికన్ ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్) తర్వాత, అదే తరహా ఉద్యోగాల కోసం విదేశీయులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయకుండా కంపెనీలపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలని ప్రతిపాదించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లి ఐటీ, వైద్య రంగాల్లో స్థిరపడిన వేలాది మంది నిపుణులు ఈబీ-2 (EB-2), ఈబీ-3 (EB-3) కేటగిరీల కింద గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’ (పెర్మ్ - PERM) విధానాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఈబీ-2 లేదా ఈబీ-3 కేటగిరీల్లో విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే ముందు, ఆ ఉద్యోగానికి తగిన అర్హతలున్న అమెరికన్ నిపుణులు అందుబాటులో లేరని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. దాదాపు 20 ఏళ్లలో పెర్మ్ కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన తొలి సమగ్ర నియంత్రణ సంస్కరణలు ఇవేనని కార్మిక శాఖ పేర్కొంది. అమెరికన్ కార్మికులకు రక్షణ కల్పించడం, నియామక నిబంధనలను ఆధునికీకరించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.
లేఆఫ్‌లు చేస్తే రెండేళ్ల పాటు నిషేధం
కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఒక కంపెనీ గత రెండేళ్లలో సంబంధిత పని ప్రదేశాల్లో అమెరికన్ ఉద్యోగులను తొలగించి ఉంటే, అదే లేదా అలాంటి ఉద్యోగాల కోసం పెర్మ్ దరఖాస్తులు దాఖలు చేయకుండా నిషేధం ఎదుర్కొంటుంది. లేఆఫ్‌ల వల్ల ప్రభావితమైన అర్హులైన అమెరికన్ కార్మికులను పరిగణనలోకి తీసుకునే కంపెనీల బాధ్యతను కేవలం ప్రాథమిక దరఖాస్తు దశకే పరిమితం చేయకుండా మరింత పొడిగించింది.
లేబర్ సర్టిఫికేషన్, దానికి అనుబంధంగా ఉండే వలస పిటిషన్ ప్రక్రియలు కొనసాగుతున్నంత కాలం, లేఆఫ్‌కు గురైన అర్హులైన అమెరికన్ ఉద్యోగులకు అవకాశం కల్పించే అంశాన్ని కంపెనీలు పరిశీలిస్తూనే ఉండాలి. లేఆఫ్‌ల బారిన పడిన వారితో సహా అమెరికన్ కార్మికులకు రక్షణలను మరింత బలోపేతం చేసేందుకే ఈ మార్పులు తెస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటన తెలిపింది.
నర్సులు, ఫిజికల్ థెరపిస్టులకు మినహాయింపులు రద్దు?
{{/usCountry}}లేబర్ సర్టిఫికేషన్, దానికి అనుబంధంగా ఉండే వలస పిటిషన్ ప్రక్రియలు కొనసాగుతున్నంత కాలం, లేఆఫ్‌కు గురైన అర్హులైన అమెరికన్ ఉద్యోగులకు అవకాశం కల్పించే అంశాన్ని కంపెనీలు పరిశీలిస్తూనే ఉండాలి. లేఆఫ్‌ల బారిన పడిన వారితో సహా అమెరికన్ కార్మికులకు రక్షణలను మరింత బలోపేతం చేసేందుకే ఈ మార్పులు తెస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటన తెలిపింది.
నర్సులు, ఫిజికల్ థెరపిస్టులకు మినహాయింపులు రద్దు?
{{/usCountry}}ప్రస్తుతం కొన్ని ప్రత్యేక వృత్తుల వారికి సాధారణ పెర్మ్ లేబర్ మార్కెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తున్న ‘షెడ్యూల్ ఏ’ (Schedule A) కేటగిరీని తొలగించాలని కూడా కార్మిక శాఖ ప్రతిపాదించింది. ఈ జాబితాలో ప్రొఫెషనల్ నర్సులు, ఫిజికల్ థెరపిస్టులతో పాటు సైన్స్, కళలు లేదా ప్రదర్శన కళల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులు ఉన్నారు.
ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఈ వృత్తుల్లో విదేశీయులను నియమించుకుని గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే కంపెనీలు కూడా సాధారణ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హులైన అమెరికన్ నిపుణులు అందుబాటులో లేరని నిరూపించాలి. జాబితాలోని వృత్తుల్లో దేశవ్యాప్తంగా అర్హులైన అమెరికన్ నిపుణుల కొరత ఉందని నిర్ధారించే విశ్వసనీయ విధానం తమ వద్ద లేనందున, ఈ మినహాయింపులను కొనసాగించలేమని కార్మిక శాఖ స్పష్టం చేసింది.
90 రోజుల పాటు ఆన్‌లైన్ ప్రకటనలు తప్పనిసరి
నియామక ప్రక్రియలోనూ కంపెనీలకు కఠిన నిబంధనలు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం తప్పనిసరిగా ఉన్న వార్తాపత్రిక ప్రకటనల వంటి పాత పద్ధతుల స్థానంలో ఎలక్ట్రానిక్ నియామక విధానాలను తీసుకురావాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం కంపెనీలు తమ సొంత వెబ్‌సైట్లు, జాబ్-సెర్చ్ ప్లాట్‌ఫారాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.
అమెరికన్ నిపుణులకు ఖాళీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం ఇచ్చేలా, ఉద్యోగ ప్రకటనలను కనీసం 90 క్యాలెండర్ రోజుల పాటు యాక్టివ్‌గా ఉంచాలి. అన్ని వృత్తుల్లో నియామక ప్రమాణాలను ఏకీకృతం చేయడంతో పాటు, కంపెనీలు రికార్డులను భద్రపరిచే బాధ్యతలను కూడా కఠినతరం చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.
అయితే, ఈ మార్పులు ఇంకా తుది రూపు దాల్చలేదు. ఈ ప్రతిపాదన ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమైన తర్వాత 60 రోజుల పాటు ప్రజలు, భాగస్వాముల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది.