...
...
Next Story

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. అయినా మూడు రికార్డులు బ్రేక్

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. రికార్డుల ఊచకోత కోస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లతో ఆడుకున్నాడు. తృటిలో క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిస్ అయినా.. 3 రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

Published on: May 27, 2026, 21:28:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 (IPL 2026) ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లకు రాజస్థాన్ రాయల్స్ (RR) ‘బోయ్ వండర్’ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును మిస్ చేసుకుని తీవ్ర నిరాశకు గురయ్యాడు.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. అయినా మూడు రికార్డులు బ్రేక్ (AFP)
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. అయినా మూడు రికార్డులు బ్రేక్ (AFP)

అయినప్పటికీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన ఈ 15 ఏళ్ల సంచలనం.. ముగ్గురు దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. వైభవ్ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది.

ముల్లన్‌పూర్‌లో సూర్యవంశీ సృష్టించిన ‘రాయల్’ విధ్వంసం

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం తప్పని నిరూపించడానికి వైభవ్‌కు ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్‌గా వచ్చిన ఈ కుర్రాడు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఆటాడేసుకున్నాడు.

కమిన్స్ ఓవర్లోనే 25 పరుగులు: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను వైభవ్ అస్సలు లెక్కచేయలేదు. మ్యాచ్ 3వ ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదడంతో పాటు ఒకే ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు.

పవర్‌ప్లేలో పరుగుల వరద: వైభవ్ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లు) ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం సింగిల్స్ తీస్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కే పరిమితమయ్యాడు. పాట్ కమిన్స్, ఈషన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్‌ను ఉతికేసాడు.

ఒకే ఇన్నింగ్స్‌తో బద్దలైన 3 చారిత్రాత్మక రికార్డులు

ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు: క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా వైభవ్ నిలిచాడు.

అత్యంత పిన్న వయస్కుడైన 600+ రన్నర్: ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 600 కంటే ఎక్కువ పరుగులు సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన (Youngest) ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 2018లో రిషబ్ పంత్ రికార్డును బ్రేక్ చేశాడు.

ప్లేఆఫ్స్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఉమ్మడిగా అత్యంత వేగవంతమైన (Joint-Fastest) హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశాడు.

తృటిలో చేజారిన హిస్టారికల్ సెంచరీ.. షాక్‌లో జట్టు

క్రిస్ గేల్ 2012లో కేవలం 30 బంతుల్లో నమోదు చేసిన అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టడానికి వైభవ్‌కు తన 29వ బంతికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ 8వ ఓవర్ చివరి బంతికి ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో షాట్ ఆడబోయి టాప్-ఎడ్జ్ ద్వారా థర్డ్ మ్యాన్ చేతికి చిక్కాడు.

వైభవ్ సూర్యవంశీ మొత్తం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఔట్ అయిన తర్వాత వైభవ్ పిచ్‌పైనే నమ్మలేనట్లు నిలబడిపోయాడు. సెంచరీ మిస్ అయిన బాధతో మైదానాన్ని వీడుతున్నప్పుడు అతని కళ్లలో నిరాశ స్పష్టంగా కనిపించింది. డగౌట్‌లో ఉన్న కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ సైతం ఈ ఊహించని ముగింపు చూసి షాక్‌లో ఉండిపోయారు.

ఇండియా ‘ఎ’ జట్టులో చోటు

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడంలో వైభవ్ సూర్యవంశీనే అత్యంత కీలక పాత్ర పోషించాడు. అతని ఈ అద్భుతమైన ఫామ్‌కు తగిన ప్రతిఫలం దక్కింది. శ్రీలంకలో జరగబోయే 50 ఓవర్ల ట్రై-సిరీస్ (Tri-Series) కోసం ఎంపిక చేసిన ఇండియా ‘ఎ’ (India A) జట్టులో వైభవ్‌కు చోటు లభించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. వైభవ్ సూర్యవంశీ ఎవరి రికార్డులను బద్దలు కొట్టాడు?

వైభవ్ ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును, అలాగే అత్యంత పిన్న వయస్సులో 600 పరుగులు దాటిన రిషభ్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు.

2. వైభవ్ సూర్యవంశీ స్కోరు ఎంత, అతను ఎంత వేగంగా హాఫ్ సెంచరీ చేశాడు?

వైభవ్ 29 బంతుల్లో 97 పరుగులు (5 ఫోర్లు, 12 సిక్సర్లు) చేశాడు. ఇందులో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్లేఆఫ్స్ రికార్డును సమం చేశాడు.

3. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తదుపరి ఎవరితో ఆడనుంది?

ఈ మ్యాచ్‌లో (SRH vs RR) విజేతగా నిలిచిన జట్టు శుక్రవారం ముల్లన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) తో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe