...
...
Next Story

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఫామ్ కోల్పోవచ్చు.. బీసీసీఐ ఏం చేయాలంటే?.. ఐపీఎల్ ఛైర్మన్ సెన్సేషనల్ కామెంట్లు

Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. సంచలన ఇన్నింగ్స్ తో తన జట్టును క్వాలిఫయర్ 2కు చేర్చాడు. అతని ఆటతీరుపై, ఫామ్ పై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సంచలన కామెంట్లు చేశాడు.

Published on: May 28, 2026, 08:36:27 IST
Advertisement

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. మైదానంలో అతడు ఆడుతున్న షాట్లకు క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది.

టీమిండియాకు ఎంపిక చేయాలని

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం (AP Photo/Ashwini Bhatia)
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం (AP Photo/Ashwini Bhatia)

ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు సెలక్ట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. త్వరలోనే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల కోసం ప్రకటించబోయే సీనియర్ పురుషుల టీ20 భారత జట్టులోకి ఈ యువ ఆటగాడిని ఎంపిక చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత్-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వైభవ్ అడుగుపెట్టే సమయం మరింత దగ్గరపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ చైర్మన్ ఏమన్నాడంటే?

వైభవ్ సూర్యవంశీపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న తరుణంలో.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సంచలన కామెంట్లు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ఒక కీలక సూచన చేశాడు. ఈ యువ ఆటగాడి మానసిక దృఢత్వం, ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు అతడిని ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని కోరాడు.

సరైన మార్గంలో

"వైభవ్‌ను బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వెన్నంటి ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది. అతడి మానసిక స్థితి దెబ్బతినకుండా సరైన మార్గంలో తీసుకెళ్లాలి. ఎందుకంటే ఆట అనేది కేవలం శారీరక నైపుణ్యాలకే పరిమితం కాదు, మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యం" అని అరుణ్ ధుమాల్ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వ్యాఖ్యానించాడు.

ఫామ్ కోల్పోవచ్చు

"ఏ గొప్ప ఆటగాడైనా కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాడు. క్రీడల్లో ఉండే ప్రత్యేకతే అది. వైభవ్ కూడా విఫలం కావచ్చు, ఫామ్ కోల్పోవచ్చు. కానీ, ఇలాంటి పరిస్థితుల నుంచే ఆట మనల్ని రాటుదేల్చుతుంది. ఓటమి నుంచి త్వరగా కోలుకుని, తదుపరి మ్యాచ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా సిద్ధం చేస్తుంది. జీవితంలో ఎదగడానికి ఇది చాలా అవసరం" అని ధుమాల్ విశ్లేషించాడు.

ఎలిమినేటర్ లో అదుర్స్

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ కొట్టాడు. తన సెన్సేషనల్ బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ ను క్వాలిఫయర్ 2కు చేర్చాడు. ఈ సీజన్ లో వైభవ్ 15 మ్యాచ్ ల్లో 680 రన్స్ తో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న 1: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని పరుగులు చేశాడు?

జవాబు: రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 680 పరుగులు సాధించాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చేసిన ఒక సెంచరీ కూడా ఉంది.

ప్రశ్న 2: వైభవ్ సూర్యవంశీ వయసు ఎంత? అతడు ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు?

జవాబు: వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 సంవత్సరాలు. ఐపీఎల్‌లో అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఓపెనర్‌గా ఆడుతున్నాడు.

ప్రశ్న 3: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వైభవ్ గురించి బీసీసీఐకి ఏం సూచించాడు?

జవాబు: వైభవ్ చిన్న వయసులోనే అద్భుతంగా రాణిస్తున్నందున, అతడి మానసిక దృఢత్వం దెబ్బతినకుండా ఉండేందుకు బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కలిసి అతడిని సరైన మార్గంలో నడిపించాలని (హ్యాండ్‌హోల్డింగ్) అరుణ్ ధుమాల్ సూచించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe