Vaibhav Sooryavanshi: వైభవ్ వచ్చేశాడోచ్.. సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల కుర్రాడి డెబ్యూ.. కానీ షాక్!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల 99 రోజుల వయసులో అతడు భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి, సచిన్ టెండూల్కర్ దశాబ్దాల రికార్డును తిరగరాశాడు.

Published on: Jul 4, 2026, 19:15:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ఎంతో కాలంగా అభిమానులు ఎగ్‌జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ (జూలై 4) ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) డెబ్యూ చేశాడు.ఈ అరంగేట్రంతో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర పుటల్లోకెక్కాడు.

వైభవ్ వచ్చేశాడోచ్.. సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్ (AFP)
వైభవ్ వచ్చేశాడోచ్.. సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్ (AFP)

సచిన్ రికార్డు బ్రేక్

ఇప్పటివరకు ఇండియా యంగెస్ట్ డెబ్యూ ప్లేయర్ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 1989లో పాకిస్తాన్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.

అలాగే, టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) రికార్డును కూడా వైభవ్ బ్రేక్ చేశాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ తన అరంగేట్రపు క్యాప్‌ను అందుకున్నాడు.

14 రన్స్ మాత్రమే

వైభవ్ సూర్యవంశీ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో నిరాశపరిచాడు. ఎన్నో అంచనాలతో క్రీజులోకి అడుగుపెట్టిన ఈ వండర్ కిడ్ బ్యాటింగ్ లో అదరగొట్టేలా కనిపించాడు. తన స్టైల్లో 2 సిక్సర్లు దంచాడు.

ఇంగ్లాండ్ డేంజరస్ పేసర్ ఆర్చర్ బౌలింగ్ తో సూర్యవంశీ అదిరే సిక్సర్ కొట్టాడు. టంగ్ బౌలింగ్ లోనూ మరోసారి బాల్ ను స్టాండ్స్ లోకి పంపించాడు. కానీ వెంటనే ఔటైపోయాడు. తన ఫస్ట్ మ్యాచ్ లో వైభవ్ కేవలం 10 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేశాడు. స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు వైభవ్.

ఐపీఎల్‌లో పరుగుల విధ్వంసం

బీహార్‌కు చెందిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి రావడం వెనుక ఐపీఎల్‌లో అతడు సృష్టించిన పరుగుల సునామీనే ప్రధాన కారణం. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున అతి చిన్న వయసులోనే సెంచరీ మార్క్‌ను అందుకున్న ఆటగాడిగా వైభవ్ గుర్తింపు పొందాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి, 35 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇండియన్ చేసిన రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ.

ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో అయితే వైభవ్ ఆట తీరు సెలెక్టర్లకు వేరే ఆప్షన్ లేకుండా చేసింది. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో ఏకంగా 237 పైగా స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి 'ఆరెంజ్ క్యాప్' సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ఒకే సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాది, క్రిస్ గేల్ పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డును తుడిచిపెట్టాడు.

వయసు చిన్నదైనా.. రికార్డులు పెద్దవి!

భారత పురుషుల క్రికెట్ చరిత్రలోనే కాకుండా, ఓవరాల్‌గా భారత క్రికెట్ (మహిళల జట్టుతో కలిపి) లోనే అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. గతంలో మహిళల జట్టులో షఫాలీ వర్మ 15 ఏళ్ల 239 రోజుల వయసులో అరంగేట్రం చేయగా, వైభవ్ అంతకంటే ముందే ఈ మైలురాయిని దాటేశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More