పిల్లల కోసం కొత్త ఎలక్ట్రిక్ బైక్- అదిరే ఫీచర్స్! తల్లితండ్రుల చేతుల్లో స్పీడ్ లిమిట్..
పిల్లల కోసం హీరో విడా 'Dirt.E K3' ఎలక్ట్రిక్ బైక్‌ని తీసుకొచ్చింది. ఇది అనేక అద్భుత ఫీచర్స్‌తో వస్తోంది. మరీ ముఖ్యంగా బైక్ స్పీడ్ లిమిట్ అనేది తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఈ-బైక్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హీరో మోటోకార్ప్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగమైన విడా.. భారతదేశంలో పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన Dirt.E K3 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. మొదటి 300 మంది వినియోగదారుల కోసం ఈ బైక్‌ను రూ. 69,990 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది.

డర్ట్ బైకింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే 4 నుంచి 10 సంవత్సరాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్‌ను రూపొందించారు. ఈ మోడల్‌తో విడా 'డర్ట్ బైక్స్ ఫ్యామిలీ'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అంటే రానున్న రోజుల్లో మరిన్ని బైక్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కాగా ఈ బైక్ మొట్టమొదటగా ఈఐసీఎంఏ 2025లో సంస్థ పరిచయం చేసింది.
పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్- అడ్జెస్టెబుల్ ఛాసిస్‌తో..
Dirt.E K3లో అడ్జెస్టెబుల్ ఛాసిస్ ఫీచర్ ఉంది. దీని ద్వారా వీల్‌బేస్, హ్యాండిల్‌బార్ ఎత్తు, రైడ్ హైట్‌ని పిల్లల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు!
స్మాల్ (చిన్నది), మీడియం (మధ్యస్థం), హైట్ (ఎక్కువ ఎత్తు) అనే మూడు దశల కాన్ఫిగరేషన్‌లతో ఈ ఎలక్ట్రిక్ బైక్ వస్తుంది. దీని వల్ల వివిధ దశల్లో బైక్ పిల్లల వయస్సుకు, ఎత్తుకు అనుగుణంగా పెరుగుతుంది.
- స్మాల్ సెట్టింగ్‌లో సీటు ఎత్తు 454 ఎంఎం ఉంటుంది.
- మీడియం సెట్టింగ్‌లో 544 ఎంఎం ఉంటుంది.
- లార్జ్ కాన్ఫిగరేషన్‌లో 631 ఎంఎం వరకు చేరుకుంటుంది.
ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ, ఈ ఈ-బైక్ బరువు కేవలం 22 కిలోలు మాత్రమే ఉండటం విశేషం.
పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్- భద్రత, పనితీరు..
భద్రత పరంగా, Dirt.E K3లో అనేక ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి:
బైక్‌ను నడుపుకుంటూ వెళ్లడానికి వీలుగా రిమూవెబుల్ ఫుట్‌పెగ్స్.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హ్యాండిల్‌బార్‌పై ఇంపాక్ట్ నుంచి రక్షణగా ఛెస్ట్ ప్యాడ్.
మాగ్నెటిక్ కిల్ స్విచ్.
వెనుక మోటార్ కవర్.
డిఫాల్ట్‌గా, ఈ ఈ-బైక్ వెనుక బ్రేక్‌తో మాత్రమే వస్తుంది. అయితే, ముందు బ్రేక్, పెద్ద చక్రాలు, వెనుక సస్పెన్షన్, పెద్ద ఫ్రంట్ సస్పెన్షన్, రోడ్-స్పెక్ టైర్ల వంటి ఆప్షనల్ యాక్సెసరీస్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్- పనితీరు..
ఈ బైక్ 500డబ్ల్యూ మోటార్, 360డబ్ల్యూహెచ్ రిమూవెబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.
ఇది లో, మిడ్, హై అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. వీటిలో ప్రతీ మోడ్‌కి స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వారికి క్రమంగా నమ్మకాన్ని పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయి.
పనితీరు, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి, Dirt.E K3 చిన్న శిక్షణ తరగతులకు లేదా ప్రారంభ ఆఫ్-రోడ్ అనుభవాలకు అనుగుణంగా ఉంటుంది.
కనెక్టెడ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా తల్లిదండ్రులు ఈ ఈ-బైక్ స్పీడ్ లిమిట్‌ని సెట్ చేయవచ్చు, యాక్సిలరేషన్ ప్రతిస్పందనను అడ్జెస్ట్ చేయవచ్చు, రైడ్ గణాంకాలను ట్రాక్ చేయవచ్చు.
ఈ మోడల్ రెడ్ డాట్ అవార్డుతో సహా అంతర్జాతీయ డిజైన్ అవార్డులను కూడా పొందింది. ఇది దాని ఎర్గోనామిక్స్, మాడ్యులర్ డిజైన్‌పై దృష్టిని హైలైట్ చేస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


