యమహా ఎక్స్ఎస్ఆర్ 155 వర్సెస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: నియో-రెట్రో బైక్స్ ఏది బెస్ట్?
యమహా ఎక్స్ఎస్ఆర్ 155 వర్సెస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: నియో-రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్? దేని ధర తక్కువ? ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ భారతదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలుగా ఉంది. స్టైలిష్‌గా ఉండే ఈ నియో-రెట్రో బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు బైక్‌లు కూడా రెట్రో, మోడర్న్ శైలిని కలిగి ఉన్నప్పటికీ.. ధర, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్ల విషయంలో మాత్రం ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయి. మీ ఎంపికను మరింత సమర్థవంతంగా నిర్ణయించుకోవడానికి ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ పరిశీలిద్దాము.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155 వర్సెస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350- ఇంజిన్ స్పెసిఫికేషన్స్
యమహా ఎక్స్ఎస్ఆర్ 155 పవర్ కోసం 155సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్‌ను ఆర్15, ఎంటీ-15 బైక్‌లతో పంచుకోవడం జరిగింది. ఇది 10,000 ఆర్‌పీఎమ్ వద్ద 18.4 హెచ్‌పీ పవర్‌ని, 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. సాఫీగా, వేగవంతంగా స్పందించే పనితీరు కోసం ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
మరోవైపు 2025 అప్డేట్స్తో వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 తన మునుపటి మోడల్‌లో ఉన్న 349సీసీ, ఎయిర్/ఆయిల్-కూల్డ్, జే-సిరీస్ ఇంజిన్‌ను కొనసాగిస్తోంది. ఇది గరిష్టంగా 20.2 బీహెచ్‌పీ పవర్‌ని, 27 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేయగలదు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
అంటే పవర్, టార్క్ అవుట్‌పుట్‌లలో హంటర్ 350 బైక్ స్పష్టంగా ముందుంది.
యమహా ఎక్స్ఎస్ఆర్ 155 వర్సెస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350- ధరల వివరాలు
యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ భారతదేశంలో రూ. 1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది. ఈ సెగ్మెంట్‌లో పోటీదారుగా ఉన్న టీవీఎస్ రోనిన్ ధర రూ. 1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏడు రంగుల వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర రూ. 1.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


