Vida VX2 Go FB : సింగిల్​ ఛార్జ్​తో 128 కి.మీ రేంజ్- విడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హైలైట్స్ ఇవే..

Vida VX2 Go FB range : హీరో విడా తన వీఎక్స్2 సిరీస్‌లో 'వీఎక్స్2 గో ఎఫ్​బీ' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఈ-స్కూటర్​ని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలను ఇక్కడ చూసేయండి..

Published on: Aug 5, 2026, 12:20:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఈవీ మార్కెట్లో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతున్న వేళ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ‘విడా’ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలే లాంచ్ చేసింద. తన ప్రాచుర్యం పొందిన వీఎక్స్2 రేంజ్‌లో సరికొత్తగా ‘వీఎక్స్2 గో ఎఫ్​బీ’ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్​షోరూం ధరను రూ. 1.13 లక్షలుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఈ- స్కూటర్ కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన విశేషాలు ఇవే:

విడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హైలైట్స్..
విడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హైలైట్స్..

1. విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ ఫిక్డ్స్ బ్యాటరీ సెటప్..

ఇప్పటివరకు వీఎక్స్2 మోడళ్లలో లభించే రిమూవబుల్ బ్యాటరీలకు భిన్నంగా, ఈ కొత్త 'విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ' వేరియంట్‌లో 3.1 kWh సామర్థ్యంగల ఫిక్డ్స్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇంటి వద్ద ఉండే సాధారణ పవర్ సాకెట్‌కు ప్లగ్ ఇన్ చేయడం ద్వారా నేరుగా స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. సొంతంగా డెడికేటెడ్ పార్కింగ్ స్థలం ఉండి, భారీ బ్యాటరీలను ప్రతిసారీ విడిగా మోయకూడదు అనుకునే వారికి ఈ సెటప్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

2. విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ- రేంజ్..

విడా సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 128 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వీఎక్స్2 కుటుంబంలో 2.2 kWh బ్యాటరీ వర్షన్ కంటే ఇది పైస్థాయిలోనూ, 3.4 kWh, 4.4 kWh మోడళ్ల కంటే కాస్త దిగువన ఈ మోడల్ నిలుస్తుంది. రోజువారీ ఆఫీసు, వ్యక్తిగత పనుల కోసం నగరంలో తిరిగే వారికి ఈ రేంజ్ కొన్ని రోజుల పాటు నిరంతర ప్రయాణానికి సరిపోతుంది.

3. విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ- సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..

ఈ స్కూటర్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 65 నిమిషాల్లోనే జీరో నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. సాధారణ వాల్ సాకెట్ ఛార్జింగ్‌తో పాటు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల అత్యవసర ప్రయాణాల్లో వాహనదారులకు సమయం ఆదా అవుతుంది.

4. విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ- పర్ఫార్మెన్స్, హార్డ్‌వేర్..

స్కూటర్ స్వింగ్-ఆర్మ్‌పై అమర్చిన 6kW ఎలక్ట్రిక్ మోటార్ దీనికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల (70 కేఎంపీహెచ్) వేగంతో ప్రయాణిస్తుందని విడా తెలిపింది. నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా దూసుకెళ్లడానికి, నిత్యం కమ్యూటింగ్ చేయడానికి ఈ వేగం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

5. విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ- నిత్య జీవితానికి ఉపయోగపడే ఫీచర్లు..

వినియోగదారుల సౌకర్యార్థం ఇందులో పొడవైన సౌకర్యవంతమైన సీటుతో పాటు, సీటు కింద 27.2 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్‌ను అందించారు. బ్యాక్‌ప్యాక్, లంచ్ బాక్స్ లేదా నిత్యావసర సరుకులను సులువుగా సర్దుకోవచ్చు. వీటితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఇచ్చే 4.3-ఇంచ్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో జోడించారు.

ఈ సరికొత్త విడా ఈ-స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక డీలర్‌షిప్‌లకు త్వరలోనే చేరుకోనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More