భారత్‌లోకి Vinfast Limo Green- అదిరిపోయే రేంజ్‌తో ఎలక్ట్రిక్ ఎంపీవీ..
ఇండియాలో విన్‌ఫాస్ట్ సంస్థ తన మూడొవ ఎలక్ట్రిక్ మోడల్‌గా 'లిమో గ్రీన్' ఎంపీవీని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. 450 కి.మీ రేంజ్, స్టైలిష్ డిజైన్, 7 సీటర్ సామర్థ్యంతో వచ్చే ఈ కారు కియా క్యారెన్స్ ఈవీ, బీవైడీ ఈ-మాక్స్ 7లకు గట్టి పోటీనివ్వనుంది.
దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సరికొత్త విప్లవం రాబోతోంది. వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్ తన లైనప్‌లోకి మరో పవర్‌ఫుల్ మోడల్‌ను చేరుస్తోంది. 'లిమో గ్రీన్' పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇప్పటికే భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ, బీవైడీ ఈ-మాక్స్ 7 వంటి మోడళ్లకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది.

ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 వంటి ఎస్‌యూవీలతో ఆకట్టుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు ఫ్యామీలీస్ కోసం ఈ విశాలమైన ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకువస్తోంది. ఈ లిమో గ్రీన్ ఫిబ్రవరి 2026లో భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ- కొలతలు, డిజైన్..
లిమో గ్రీన్ చూడటానికి చాలా హుందాగా, సాంప్రదాయ ఎంపీవీ శైలిలో ఉంటుంది. విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ స్టైల్ అయిన 'వీ' ఆకారపు డిజైన్ ఎలిమెంట్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.
దీని పొడవు 4,740 ఎంఎం, వెడల్పు 1,872 ఎంఎం, ఎత్తు 1,728 ఎంఎం.
బీవైడీ ఇ-మాక్స్ 7తో పోలిస్తే, ఈ విన్‌ఫాస్ట్ లియో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ 30 ఎంఎం పొడవుగా, 62 ఎంఎం వెడల్పుగా ఉంటుంది. దీనివల్ల కారు లోపల ప్రయాణికులకు మరింత విశాలమైన చోటు లభిస్తుంది.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..
అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, లిమో గ్రీన్‌లో శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు.
బ్యాటరీ ప్యాక్: 60.13 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల వరకు ఈ ఎలక్ట్రిక్ కారు ప్రయాణించవచ్చు.
పవర్: దీని మోటార్ 201 హెచ్‌పీ పవర్‌ని, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 80కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్- ఫీచర్లు, భద్రత..
ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగం చాలా సింపుల్‌గా, ఆధునిక హంగులతో ఉంటుంది. ఇందులో 2+3+2 పద్ధతిలో 7 మంది ప్రయాణించే వీలుంది.
టెక్నాలజీ: 10.1-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్, 4 స్పీకర్ల ఆడియో సిస్టమ్, సింగిల్ జోన్ ఏసీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి.
సేఫ్టీ: ప్రయాణికుల భద్రత కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుత మోడల్‌లో అడాస్ ఫీచర్ లేకపోవడం గమనార్హం.
మొత్తానికి, పెద్ద కుటుంబాలకు, ప్రయాణాల్లో సౌకర్యాన్ని కోరుకునే వారికి విన్ ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఒక అద్భుతమైన ఎంపిక కానుంది. ఈ ఈవీ ధర, ఇతర వివరాలు ఫిబ్రవరిలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.
ఆ తర్వాత.. విన్‌ఫాస్ట్ వీఎఫ్5..
ఇండియాలో ఈవీ మార్కెట్‌ని క్యాప్చర్ చేసేందుకు విన్‌ఫాస్ట్ సంస్థ గట్టిగానే ప్రణాళికలు రచిస్తోందని చెప్పుకోవాలి. లిమో గ్రీన్ తర్వాత మరో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంచ్ చేసేందుకు ఈ సంస్థ రెడీ అవుతోంది. దాని పేరు విన్‌ఫాస్ట్ వీఎఫ్5. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడలే అయినా, చూడటానికి ఒక ఎస్‌యూవీలా ఉంటుంది.
టాటా పంచ్ ఈవీకి పోటీగా వస్తున్న ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్5కి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


