...
...
Next Story

Viral video : షాకింగ్! గాలిలో పారాగ్లైడర్​.. దూసుకొచ్చిన విమానం- ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Paraglider plane collision : ఒక పారాగ్లైడర్​కి భయానక అనుభవం ఎదురైంది! పారాగ్లైడింగ్​ చేస్తున్న సమయంలో ఆమెవైపు ఒక విమానం దూసుకొచ్చింది. ఆమె కెనోపీని చీల్చేసి వెళ్లిపోయింది. ఆమె వేగంగా కిందపడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Published on: May 25, 2026, 06:04:46 IST
Advertisement

ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వత శ్రేణులపై ఒక భయంకరమైన గగనతల ప్రమాదం జరిగింది! గాల్లో విహరిస్తున్న 44 ఏళ్ల మహిళా పారాగ్లైడర్ కెనోపీని (బెలూన్) ఒక టూరిస్ట్ విమానం బలంగా ఢీకొట్టి, ధ్వంసం చేసింది. దీనితో ఆమె గాల్లో నియంత్రణ కోల్పోయి అత్యంత వేగంగా భూమి వైపు దూసుకొచ్చింది. అయితే, ప్రాణభయంతో వణికిపోతున్న సమయాల్లో కూడా ఆమె అద్భుతమైన చాకచక్యంతో ఎమర్జెన్సీ పారాచూట్‌ను తెరిచి ప్రాణాలతో బయటపడింది. హాలీవుడ్ యాక్షన్ సీన్‌ను తలపించే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసలేం జరిగింది?

పారాగ్లైడర్​ వైపు దూసుకొచ్చిన విమానం! ఆ తర్వాత..
పారాగ్లైడర్​ వైపు దూసుకొచ్చిన విమానం! ఆ తర్వాత..

ఉత్తర ఆస్ట్రియాలోని ‘ష్మిట్టెన్‌హోహె’ పర్వత ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ఊహించని ప్రమాదం జరిగింది. నార్త్ ఆస్ట్రియాకు చెందిన సబ్రినా (44) అనే అనుభవజ్ఞురాలైన పారాగ్లైడర్ పైలట్.. పర్వతం పైనుంచి పిజెన్‌డార్ఫ్ వైపు గాల్లో ప్రయాణిస్తోంది.

కాగా మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో పింజ్‌గౌర్ హుట్టె పర్వత కుటీరం సమీపంలో సబ్రినా గాల్లో చిన్నపాటి విన్యాసం చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో, టైరోల్‌కు చెందిన 28 ఏళ్ల పైలట్ నడుపుతున్న ‘సెస్నా’ అనే చిన్న విమానం ఆల్ప్స్ పర్వతాల మీదుగా పర్యాటకులతో విహరిస్తోంది. విమాన పైలట్ పారాగ్లైడర్‌ను గమనించేలోపే.. విమానం నేరుగా వచ్చి సబ్రినా తల పైభాగం నుంచి దూసుకెళ్లింది. విమానం ముందుండే 'ప్రొపెల్లర్' బలంగా తగలడంతో సబ్రినా పారాగ్లైడర్ రెక్కలు, కెనోపీ నిలువుగా రెండు ముక్కలైపోయాయి.

కెమెరాలో రికార్డైన ఆర్తనాదాలు..

సబ్రినా హెల్మెట్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. విమానం తన కెనోపీని చీల్చుకుంటూ వెళ్లిన క్షణంలో ఆమె భయంతో గట్టిగా అరిచింది. పారాగ్లైడర్ విరిగిపోవడంతో ఆమె గాల్లో చక్రంలా తిరుగుతూ వేగంగా కిందికి పడిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ప్రాణం నిలిపిన ఎమర్జెన్సీ పారాచూట్..

అనంతరం కొద్ది క్షణాల్లోనే ఆమె భూమిని బలంగా తాకింది.

ఈ భయంకరమైన ఘటన తర్వాత కూడా ఆమె కేవలం కొన్ని చిన్న చిన్న గాయాలు, గీతలతో సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతమనే చెప్పాలి.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

ప్రమాదం తర్వాత స్పందించిన బాధితురాలు..

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఆస్ట్రియన్ పోలీస్ హెలికాప్టర్ ‘లిబెల్లే ఓస్కర్’ అడవిలో పడి ఉన్న సబ్రినాను రక్షించి, చికిత్స నిమిత్తం జెల్ యామ్ సీ ఎయిర్‌పోర్ట్‌కు తరలించింది. మరోవైపు, పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన విమానం కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా జెల్ యామ్ సీ విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ అయింది. గాల్లో పారాగ్లైడర్‌ను తప్పించే అవకాశం తనకు అస్సలు దొరకలేదని విమాన పైలట్ తెలిపాడు.

గాయాల నుంచి కోలుకున్న తర్వాత సబ్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "నేను ఇక్కడ కూర్చుని ఈ పోస్ట్ టైప్ చేస్తున్నానంటే నాకే నమ్మకం కలగడం లేదు. కొన్ని నల్లటి వాతలు, నొప్పులు మినహాయిస్తే నాకు ఏమీ కాలేదు. నేను బతికే ఉన్నాను," అని జర్మన్ భాషలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks