రికార్డుల కింగ్ కోహ్లి-సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్-ప్రపంచంలోనే ఫస్ట్ బ్యాటర్

కింగ్ కోహ్లీనా మజాకా! విరాట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలోనే ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేలో కోహ్లి ఈ ఫీట్ అందుకున్నాడు. 

Published on: Jan 11, 2026 7:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విరాట్ కోహ్లి మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ తనలో పరుగుల వేగం తగ్గలేదు. ఆటపై కసి తీరలేదేని మరోసారి స్పష్టం చేశాడు. ఈ రికార్డుల వివరాలపై ఓ లుక్కేయండి.

విరాట్ కోహ్లి (AFP)
విరాట్ కోహ్లి (AFP)

విరాట్ కోహ్లి రికార్డు

పరుగుల రారాజు, రన్ మెషిన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28 వేల పరుగులు కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు కింగ్ కోహ్లి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్. ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లి ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఛేజింగ్ లో 13వ ఓవర్లో విరాట్ ఈ ఘనత సాధించాడు.

624 ఇన్నింగ్స్ ల్లో

విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 28000 పరుగుల మైల్ స్టోన్ చేరుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించాడు. కేవలం 624 ఇన్నింగ్స్ ల్లోనే విరాట్ కోహ్లి ఈ మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 644 ఇన్నింగ్స్ ల్లో 28 వేల పరుగులు చేశాడు.

మూడో బ్యాటర్

ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 28000 పరుగులు అందుకున్న క్రికెటర్లలో విరాట్ మూడో బ్యాటర్. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, శ్రీలంక లెెజెండరీ బ్యాటర్ కుమార సంగక్కర ముందున్నారు. కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు.

వరుసగా అయిదో ఫిఫ్టీ

వన్డేల్లో విరాట్ కోహ్లి ఫామ్ మామూలుగా లేదు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో విరాట్ కు ఇది వరుసగా అయిదో ఫిఫ్టీ. 44 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెకండ్ ప్లేస్ కు చేరుకున్నాడు. కుమార్ సంగక్కర (594 మ్యాచ్ ల్లో 28016)ను కోహ్లి దాటేశాడు. సచిన్ (664 మ్యాచ్ ల్లో 34357 పరుగులు) టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న సచిన్ ను కోహ్లి అందుకోవడం కష్టమేనని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More