Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. కోహ్లి రికార్డుల మోత.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమంటూ ఫ్యాన్స్ రచ్చ.. ఆర్సీబీ విక్టరీ
Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్. ఇంటర్నేషనల్ క్రికెట్లో కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్ లో అదరగొట్టాడు. హాఫ్ సెంచరీతో టీమ్ ను గెలిచించాడు. రికార్డుల మోత మోగించాడు. దీంతో కోహ్లి రిటైర్మెంట్ నుంచి వెనక్క రావాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియణ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. శనివారం (మార్చి 28) రాత్రి చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
37 ఏళ్ల వయసులోనూ కోహ్లి తన పవర్ ఏంటో మరోసారి చూపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 5 అద్భుతమైన బౌండరీలు ఉన్నాయి. కేవలం 33 బంతుల్లోనే తన 64వ ఐపీఎల్ అర్ధశతకాన్ని పూర్తి చేసి కోహ్లి చరిత్ర సృష్టించాడు.
కోహ్లి రికార్డులు
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. ఈ స్టార్ ప్లేయర్ 64 అర్ధశతకాలతో టాప్ లో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (62) సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఛేజ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్న కోహ్లి ఐపీఎల్ ఛేజింగ్ లో 4000 రన్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు.
ఆర్సీబీ ఛేజింగ్
ఆర్సీబీతో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 201/9 భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (80), అనికేత్ వర్మ (43) చెలరేగారు. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ మూడు వికెట్లతో రాణించి హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఎంతో సునాయాసంగా ఛేదించింది.
దేవదత్ పడిక్కల్ అదుర్స్
ఛేజింగ్ లో ఫిల్ సాల్ట్ (8) త్వరగానే ఔటైపోయాడు. అయితే మరో ఓపెనర్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ (61) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. కెప్టెన్ రజత్ పటీదార్ (31) కూడా మెరిశాడు. దీంతో మరో 26 బంతులు ఉండగానే ఆర్సీబీ టార్గెట్ రీచ్ అయింది.
కోహ్లీ రిటైర్మెంట్‌పై చర్చ
కోహ్లీ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి కోహ్లి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ రిటైర్మెంట్ నుంచి వెనక్కి రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ కోహ్లీలో అదే పరుగుల ఆకలి, అదే ఫామ్ ఉందని అంటున్నారు. అతను మళ్లీ టీమిండియా టీ20 జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.
మరింత ఉత్సాహంగా..
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "విరామం నాకు మానసికంగా చాలా సహాయపడింది. నేను తాజాగా, ఉత్సాహంగా తిరిగి వచ్చాను. అండర్ ప్రిపేర్డ్‌గా నేను ఎప్పుడూ మైదానంలోకి దిగను. శారీరక ఫిట్‌నెస్, మానసిక ఉత్సాహం తోడైతే ఫలితాలు ఇలాగే ఉంటాయి" అని కోహ్లి పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


