విరాట్ కోహ్లి ఫెరారీలాంటోడు.. అత్యద్భుతమైన ప్లేయర్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసల వర్షం

టీమిండియా గ్రేట్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్. అతన్ని ఫెరారీ కారుతో పోల్చడం విశేషం. అత్యద్భుతమైన ప్లేయర్ అని, ఆ విషయంలో ఎవరూ మరో మాట మాట్లాడటానికి లేదని అన్నాడు.

Published on: Oct 17, 2025, 15:20:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీమిండియాలోకి విరాట్ కోహ్లీ రాకతో మరోసారి అతనిపైనే అందరి దృష్టి ఉంటుందని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మాథ్యూ హేడెన్ కొనియాడాడు. టెస్టు మ్యాచ్‌లు, టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా తరఫున ఆడుతున్నాడు. ఆదివారం (అక్టోబర్ 19) తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో కోహ్లి గురించి మాథ్యూ హేడెన్ మాట్లాడాడు.

విరాట్ కోహ్లి ఫెరారీలాంటోడు.. అత్యద్భుతమైన ప్లేయర్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసల వర్షం (AFP)
విరాట్ కోహ్లి ఫెరారీలాంటోడు.. అత్యద్భుతమైన ప్లేయర్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసల వర్షం (AFP)

కోహ్లీ ఒక ఫెరారీ: హేడెన్

మైదానంలో విరాట్ కోహ్లీ పట్టుదలగా ఉండే విధానాన్ని హేడెన్ మెచ్చుకుంటూ అతని తిరుగులేని శక్తి, ఆకర్షణకు అతన్ని "ఫెరారీ"తో పోల్చాడు. ఈ మాజీ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్.. కోహ్లీ వ్యక్తిత్వంపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని, దానికి కారణం "అతను అసాధారణంగా గొప్ప ఆటగాడు" కావడమే అన్నాడు.

"విరాట్ ఎప్పుడు ఉత్సాహంగా, చురుకుగా ఉంటాడు. అతను ఒక ఫెరారీ. అతడు ఫుల్ సౌండ్ చేస్తుంటాడు. ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేస్తాడు. అతను క్రికెట్ మైదానంలో చేసే ప్రతి పనిపై జియోస్టార్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. అతని ప్రతి కదలిక చాలా ప్రముఖంగా ఉంటుంది కాబట్టి దాని గురించి భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడకుండా ఉండటం కష్టం. ఎందుకంటే అతను అంత గొప్పగా ఆడతాడు" అని హేడెన్ ఆల్ ఓవర్ ద బార్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు.

ఆ విషయంలో కోహ్లి గోల్డ్ స్టార్

మరోవైపు విరాట్ కోహ్లి తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియా టూర్ కు తిరిగి వస్తున్నాడు. ఇక్కడ అతనికి తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో 29 వన్డే మ్యాచ్‌లు ఆడి దాదాపు 51.90 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాపై అతడు సాధించిన ఆధిపత్యాన్ని సూచిస్తుంది.

ఇక హేడెన్ ఈ రికార్డుతోపాటు కోహ్లి తన ఫిట్‌నెస్ ను మెయింటేన్ చేసే తీరును కూడా ప్రశంసించాడు. అతన్ని ఓ గోల్డెన్ స్టార్ గా చెప్పాడు. ఇప్పటికే అతడు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటంపైనే దృష్టి సారించాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు.

"అతను 302 మ్యాచ్ లు ఆడి 14,000 పరుగులు చేశాడు. ఇక వన్డే క్రికెట్‌లో అతని సగటు గురించి ఏం చెప్పగలం.. అది అద్భుతం. అతని విజయానికి కీలకం ఏంటంటే అతను తన ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడంలో ఒక గోల్డెన్ స్టార్. నా ఆలోచనలో అతను 2027 ప్రపంచ కప్‌పై దృష్టి పెడుతున్నాడు. అతను దానిలో భాగం కావాలని కోరుకుంటున్నాడు" అని హేడెన్ తెలిపాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More