ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో, భారత మార్కెట్లోకి తన సరికొత్త 'టీ' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. తాజాగా అందిన లీకుల ప్రకారం ‘వివో టీ5 ప్రో’ పేరుతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్.. గతేడాది విడుదలైన వివో టీటీ ప్రోకు వారసుడిగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్, పర్ఫార్మెన్స్ వంటి కీలక విభాగాల్లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
వివో టీ5 ప్రో- లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చు?

స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన సమాచారం మేరకు.. వివో టీ5 ప్రో ఏప్రిల్ మధ్య నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా బ్రాండ్లు వసంత కాలంలో కొత్త మిడ్-రేంజ్ ఫోన్లను పరిచయం చేసే క్రమంలోనే వివో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, భారత్‌లో ఇది రూ. 30,000 నుంచి రూ. 35,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైస్ పాయింట్ వద్ద ఇది ‘నథింగ్ ఫోన్ 4ఏ’ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని అంచనా.
వివో టీ5 ప్రో- ఫీచర్లు (లీక్స్)..
డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.8- ఇంచ్ 1.5K అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 144హెచ్‌జెడ్ హై-రీఫ్రెష్ రేట్ ఉండటం విశేషం.
ప్రాసెసర్ అండ్ సాఫ్ట్‌వేర్: ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌ను వాడినట్లు సమాచారం. అలాగే ఇది అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై పనిచేస్తుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఈ వివో టీ5 ప్రో అందించనున్నారు. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏకంగా 9,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. దీనికి తోడు 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
{{/usCountry}}బ్యాటరీ అండ్ ఛార్జింగ్: ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏకంగా 9,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. దీనికి తోడు 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
{{/usCountry}}మన్నిక: ఇది ఐపీ68, ఐపీ69+ రేటింగ్‌లతో వస్తోంది. దీనివల్ల దుమ్ము, నీరు, వాటర్ స్ప్రేల నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ లభిస్తుంది.
వివో టీటీ ప్రో (2025) వర్సెస్ వివో టీ5 ప్రో (2026)..
గతేడాది ఆగస్టులో విడుదలైన వివో టీ4 ప్రో ధర రూ. 27,999 నుంచి రూ. 32,000 మధ్య ఉంది. దానితో పోలిస్తే కొత్తగా వస్తున్న టీ5 ప్రోలో అనేక మార్పులు ఉన్నాయి:
టీ4 ప్రోలో 6.77-ఇంచ్ 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే ఉండగా, టీ5 ప్రోలో 6.8-ఇంచ్ 144హెచ్‌జెడ్ డిస్‌ప్లే రానుంది.
టీ4 ప్రోలో 6,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, టీ5 ప్రోలో అది ఏకంగా 9,020ఎంఏహెచ్కి పెరిగింది.
ప్రాసెసర్ విషయానికి వస్తే టీ4 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ఉండగా, టీ5 ప్రోలో లేటెస్ట్ 7ఎస్ జెన్ 4ను ఉపయోగిస్తున్నారు.
టీ4 ప్రోలో ఉన్న ఐపీ68 + ఐపీ69 రేటింగ్‌ను టీ5 ప్రోలో ఐపీ69+ కు అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం.
గ్లేసియర్ బ్లూ, కాస్మిక్ బ్లాక్ రంగుల్లో లభించనున్న ఈ ఫోన్, మిడ్-రేంజ్ విభాగంలో కొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది.