Vivo x300s : వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్- ఒకటి 200ఎంపీ డ్యూయెల్ కెమెరాతో! లాంచ్ ఎప్పుడంటే..
Vivo new smartphones : వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌కు రెడీ అవుతున్నాయి. అవి వివో ఎక్స్300ఎస్, వివో ఎక్స్300. ఈ నేపథ్యంలో వీటి లాంచ్ డేట్‌తో పాటు వీటికి సంబంధించి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వివో కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ వచ్చేస్తోంది. తన అద్భుతమైన కెమెరా పనితీరుతో మార్కెట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ‘వివో ఎక్స్300 అల్ట్రా’ లాంచ్ తేదీని కంపెనీ ఇటీవలే అధికారికంగా ఖరారు చేసింది. మార్చి 30న చైనాలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో ఎక్స్300 అల్ట్రాతో పాటు ‘వివో ఎక్స్300ఎస్’ అనే మోడల్‌ను కూడా విడుదల చేయనున్నారు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఎక్స్200ఎస్కి సక్సెసర్‌గా ఈ ఎక్స్300ఎస్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో ఎక్స్300ఎస్: స్టైలిష్ డిజైన్.. అదిరిపోయే ఆడియో
వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఎక్స్300ఎస్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో వృత్తాకార కెమెరా ఐలాండ్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ప్రముఖ లెన్స్ తయారీ సంస్థ 'జైస్' (Zeiss) బ్రాండింగ్ ఉండటంతో, ఫోటోగ్రఫీలో ఈ ఫోన్ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని ఆశించవచ్చు.
ముఖ్య ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.78 ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 144 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 1.5కే రిజల్యూషన్.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
కెమెరా: 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది.
ఆడియో: గేమర్స్ కోసం ప్రత్యేకంగా 'సూపర్-సెన్స్ గేమింగ్ ఆడియో జోన్' ఫీచర్‌ను ఇచ్చారు. ఇది గేమ్ ఆడియో డీటెయిల్స్‌ను 120 శాతం వరకు పెంచుతుందని వివో పేర్కొంది.
ఇతరాలు: అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్.
వివో ఎక్స్300 అల్ట్రా: కెమెరాలో రారాజు!
ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్.. వివో ఎక్స్300 అల్ట్రా. ఇది అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఇది పనిచేస్తుంది.
కెమెరా అద్భుతాలు:
ఈ ఫోన్ వెనుక మూడు పవర్‌ఫుల్ కెమెరాలు ఉన్నాయి.
200 ఎంపీ మెయిన్ కెమెరా.
200 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3.7x ఆప్టికల్ జూమ్).
50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్.
ముందు భాగంలో సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు, దీని ద్వారా 4కే వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
బ్యాటరీ స్టోరేజ్:
ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో భారీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది 256 జీబీ నుంచి ఏకంగా 1 టీబీ స్టోరేజ్ వరకు వేర్వేరు వేరియంట్లలో లభ్యం కానుంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.
మార్చి 30న జరిగే లాంచ్ తర్వాత ఈ ఫోన్ల ధర, అంతర్జాతీయ మార్కెట్లోకి (ముఖ్యంగా భారత్‌లోకి) ఎప్పుడు వస్తాయనే వివరాలు వెల్లడికానున్నాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. వివో X300 అల్ట్రా ఇండియాలో ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
వివో X300 అల్ట్రా మార్చి 30న చైనాలో లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్, ఇండియా లాంచ్ విషయానికి వస్తే, ఇది 2026 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్ మధ్య) భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల అంచనా. సాధారణంగా చైనా లాంచ్ జరిగిన కొన్ని వారాల తర్వాతే అంతర్జాతీయ విడుదల ఉంటుంది.
2. X300 అల్ట్రాలో ఉన్న 7,000mAh బ్యాటరీ ప్రత్యేకత ఏమిటి?
ఇది వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్లలోనే ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీ. సాధారణంగా ప్రీమియం ఫోన్లలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది, కానీ వివో ఏకంగా 7,000mAh సామర్థ్యాన్ని అందించడం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరాటంకంగా వాడుకోవచ్చు. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం విశేషం.
3. వివో X300s, X300 అల్ట్రా మధ్య ప్రధాన తేడాలేమిటి?
ప్రధానంగా ప్రాసెసర్- కెమెరా విభాగాల్లో తేడాలు ఉన్నాయి.
ప్రాసెసర్: X300 అల్ట్రాలో అత్యంత శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5’ ఉండగా, X300s మోడల్‌లో ‘మీడియాటెక్ డైమెన్సిటీ 9500’ చిప్‌సెట్ ఉంది.
కెమెరా: అల్ట్రా మోడల్‌లో డ్యూయల్ 200MP కెమెరా సెటప్ (మెయిన్ + పెరిస్కోప్) ఉండగా, X300s లో 200MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


