Vivo T5x 5G : వివో కొత్త స్మార్ట్​ఫోన్​- రూ.20వేల కన్నా తక్కువకే 7200ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా..

Vivo T5x 5G price : భారత మార్కెట్​లోకి వివో తన సరికొత్త 'టీ5' సిరీస్‌ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో మొదటి ఫోన్‌గా వీవో టీ5ఎక్స్​ 5జీని విడుదలైంది. 7200 ఎంఏహెచ్​ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Published on: Mar 17, 2026, 15:15:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివో ఇండియా తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో టీ5ఎక్స్​ 5జీని మంగళవారం భారత్‌లో విడుదల చేసింది. అత్యుత్తమ పనితీరు కోరుకునే యూజర్ల కోసం రూపొందించిన ఈ స్మార్ట్​ఫోన్​.. తన సెగ్మెంట్‌లోనే అత్యంత వేగవంతమైన గ్యాడ్జెట్​ అని సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

వివో టీ5ఎక్స్​ 5జీ విశేషాలు..
వివో టీ5ఎక్స్​ 5జీ విశేషాలు..

వివో టీ5ఎక్స్​ 5జీ- సెగ్మెంట్‌లోనే భారీ బ్యాటరీ!

ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7200 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ అని చెప్పుకోవాలి. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా దాదాపు 15 గంటల పాటు గేమింగ్ ఆడుకోవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇందులో రివర్స్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. అంటే, మీ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడుకుని ఇతర పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్‌తో కేవలం 43 నిమిషాల్లోనే 50% బ్యాటరీ నిండుతుంది. బ్యాటరీ ఆరోగ్యం కోసం 6 ఏళ్ల వారంటీని కూడా వివో అందిస్తోంది.

వివో టీ5ఎక్స్​ 5జీ- టర్బో పెర్ఫార్మెన్స్..

మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో వస్తున్న ఈ వివో టీ5ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్.. అంటుటు (AnTuTu) బెంచ్‌మార్క్‌లో 10 లక్షల కంటే ఎక్కువ స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. 4 ఎన్​ఎం ప్రాసెస్ టెక్నాలజీ, 8 జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ల వల్ల మల్టీ టాస్కింగ్ చాలా సులువుగా ఉంటుంది.

వివో టీ5ఎక్స్​ 5జీ- మిలిటరీ గ్రేడ్ ధృవీకరణ.. నీటిలో పడినా ఢోకా లేదు!

వివో టీ5ఎక్స్​ 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ధృవీకరణ పొందింది. ఆక్సిడెంటల్ డ్రాప్స్ (ప్రమాదవశాత్తు కింద పడటం) నుంచి రక్షణ కోసం 'కాంప్రహెన్సివ్ కుషనింగ్ స్ట్రక్చర్'ను అమర్చారు. అలాగే ఇది ఐపీ68 అండ్​ ఐపీ69+ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

మరో హైలైట్​ ఏంటంటే.. స్పీకర్లలో నీరు లేదా ధూళి చేరితే 'వన్-టాప్ ఎజెక్షన్' ఫీచర్ ద్వారా సోనిక్ వైబ్రేషన్‌తో వాటిని బయటకు పంపవచ్చు!

వివో టీ5ఎక్స్​ 5జీ- కెమెరా, డిస్‌ప్లే విశేషాలు..

డిస్‌ప్లే: 6.76-ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్‌ప్లే, 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

కెమెరా: వివో టీ5ఎక్స్​ 5జీ వెనుక వైపు 50 ఎంపీ ఏఐ మెయిన్ కెమెరా, ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు వైపులా 4కే వీడియో రికార్డింగ్ సదుపాయం ఉండటం విశేషం.

సాఫ్ట్‌వేర్: వివో తన సరికొత్త OriginOS 6ని ఈ వివో టీ5ఎక్స్​ 5జీతో పరిచయం చేసింది. ఇది 'సర్కిల్ టు సెర్చ్', 'ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్' వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది.

వివో టీ5ఎక్స్​ 5జీ- ధర, లభ్యత..

మార్చ్​ 24, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది.

6 GB + 128 GB: రూ. 18,999

8 GB + 128 GB: రూ. 20,999

8 GB + 256 GB: రూ. 22,999

వివో టీ5ఎక్స్​ 5జీ- లాంచ్ ఆఫర్లు ఇలా..

హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 2000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. వివో ఇండియా తన 'మేక్ ఇన్ ఇండియా' నిబద్ధతతో భాగంగా గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఈ ఫోన్లను తయారు చేస్తోంది.

మరి ఈ వివో టీ5ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్​ని మీరు కొంటారా?

ప్రశ్నలు - సమాధానాలు-

1. vivo T5x 5G లోని బ్యాటరీ ప్రత్యేకత ఏమిటి?

ఇందులో 7200 mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, అంటే మీ ఫోన్‌తో మరో ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి 6 ఏళ్ల బ్యాటరీ హెల్త్ వారంటీ కూడా ఉంది.

2. ఈ ఫోన్ ఎంతవరకు నీటిని తట్టుకోగలదు?

ఈ ఫోన్ కు IP68, IP69+ రేటింగ్ ఉంది. అంటే ఇది ధూళి- నీటిని అత్యంత సమర్థవంతంగా తట్టుకుంటుంది. స్పీకర్లలో నీరు చేరితే వైబ్రేషన్ ద్వారా బయటకు పంపే టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

3. గేమింగ్ కోసం ఇందులో ఏవైనా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయా?

అవును. గేమింగ్ కోసం 'మాన్‌స్టర్ మోడ్', '4డీ గేమ్ వైబ్రేషన్', 'గేమింగ్ హైపర్ సెన్స్ ఆడియో' వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More