Vivo new smartphone : 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో వివో కొత్త స్మార్ట్​ఫోన్​- ధర తక్కువే!

Vivo V70 FE : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన వీ70 సిరీస్‌లో మూడొవ ఫోన్‌గా 'వివో వీ70 ఎఫ్​ఈ'ని ఇండోనేషియాలో లాంచ్ చేసింది. భారీ 7,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా వంటి అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు మీకోసం..

Published on: Mar 10, 2026, 06:45:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన పాపులర్ వీ70 సిరీస్‌ను మరింత విస్తరించింది. ఇప్పటికే భారత్‌లో విడుదలైన వివో వీ70తో పాటు ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్లోకి 'వివో వీ70 ఎఫ్​ఈ' (Vivo V70 FE) నిప్రవేశపెట్టింది. అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వీ70 ఎఫ్​ఈ.. (Representative image)
వివో వీ70 ఎఫ్​ఈ.. (Representative image)

వివో వీ70 ఎఫ్​ఈ- ధర, లభ్యత..

ఇండోనేషియా మార్కెట్లో వివో వీ70 ఎఫ్​ఈ మూడు వేరియంట్లలో లభిస్తుంది:

8 GB ర్యామ్​ + 256 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 64,99,000 (మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 35,000).

12 GB ర్యామ్ + 256GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 71,99,000 (సుమారు 39,000).

8 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 73,99,900 (సుమారు రూ. 40,000).

ఈ ఫోన్ బ్లూ, లైట్ పర్పుల్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

వివో వీ70 ఎఫ్​ఈ- డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..

వివో వీ70 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6పై నడుస్తుంది. ఇందులో 6.83 ఇంచ్​ 1.5కే (1,260x2,800 పిక్సెల్స్) క్యూ10+ అమోఎల్​ఈడీ డిస్‌ప్లేను అందించారు.

డిస్‌ప్లే ఫీచర్స్: 120 హెచ్​జెడ్​ రీఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, పీ3 వైడ్ కలర్ గామట్ వంటి ఫీచర్లు యూజర్లకు గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి.

ప్రాసెసర్: ఈ ఫోన్ 4 ఎన్​ఎం ప్రక్రియపై రూపొందించిన మీడియాటెక్​ డైమెన్సిటీ 7360-టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 2.5 జీహెచ్​జెడ్​ క్లాక్ స్పీడ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి. ఇది మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు మెరుగ్గా సహకరిస్తుంది.

ప్రొటెక్షన్: ఈ వివో వీ70 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్ దుమ్ము- నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్‌తో వస్తుంది.

వివో వీ70 ఎఫ్​ఈ- అదిరిపోయే కెమెరా సెటప్..

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వివో ఇందులో శక్తివంతమైన కెమెరాలను అమర్చింది:

ప్రైమరీ కెమెరా: 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (f/1.88) ఉంది. ఇది ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్​) సదుపాయాన్ని కలిగి ఉంది, దీనివల్ల ఫోటోలు చాలా స్పష్టంగా వస్తాయి.

అల్ట్రావైడ్: 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు.

సెల్ఫీ: వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

వివో వీ70 ఎఫ్​ఈ- బ్యాటరీ, కనెక్టివిటీ..

ఈ స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. దీనికి తోడు 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉండటం మరో విశేషం. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ రావడమే కాకుండా, చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

కనెక్టివిటీ పరంగా చూస్తే.. 5జీ, 4జీ ఎల్​టీఈ, బ్లూటూత్ 5.4, ఎన్​ఎఫ్​సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు సుమారు 200 గ్రాములు ఉంటుంది.

ఈ వివో వీ70 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్​ ఇండియా లాంచ్​పై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. Vivo V70 FE ఫోన్ నీటిలో పడినా పాడవకుండా ఉంటుందా?

అవును, ఈ స్మార్ట్‌ఫోన్ అత్యున్నత స్థాయి రక్షణ ప్రమాణాలతో వస్తుంది. దీనికి IP68- IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ఇది కేవలం మంచి నీటిలోనే కాకుండా, అధిక పీడనం (High pressure) కలిగిన వేడి నీటి ధారలను కూడా తట్టుకోగలదు. దుమ్ము -నీటి నుంచి దీనికి పూర్తి రక్షణ ఉంటుంది.

2. ఈ ఫోన్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది

Vivo V70 FE లో భారీ 7,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. కంపెనీ లెక్కల ప్రకారం, బాక్స్‌లో ఇచ్చే స్టాండర్డ్ ఛార్జర్‌తో ఈ ఫోన్‌ను 1% నుంచి 100% వరకు ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 60 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More