Poco C85x 5G : పోకో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​- భారీ బ్యాటరీతో! లాంచ్​ ఎప్పుడంటే..

Poco C85x 5G India Launch : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో, తన సరికొత్త 5జీ హ్యాండ్‌సెట్ 'పోకో సీ85ఎక్స్​ 5జీ'ని మార్చ్​ 10న భారత్‌లో విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ డిజైన్, డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్, భారీ బ్యాటరీ వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Published on: Mar 8, 2026, 10:45:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ టెక్ సంస్థ పోకో భారతీయ వినియోగదారుల కోసం మరో పవర్‌ఫుల్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సిద్ధం చేస్తోంది. 'పోకో సీ85ఎక్స్​ 5జీ' పేరుతో రానున్న ఈ కొత్త స్మార్ట్​ఫోన్ ఈ మార్చ్​ 10న భారత్‌లో గ్రాండ్ లాంచ్ కానున్నట్లు సంస్థ ఇటీవలే వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను అప్‌డేట్ చేశారు. ఈ సైట్ ద్వారా ఫోన్ వెనుక భాగం పూర్తి డిజైన్ వెల్లడైంది.

పోకో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. (Representative Image)
పోకో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. (Representative Image)

గతేడాది డిసెంబర్ 2025లో విడుదలైన పోకో సీ85 5జీకి కొనసాగింపుగా ఈ 'ఎక్స్​' వేరియంట్ వస్తోంది. అప్పట్లో విడుదలైన పోకో సీ85 5జీ.. 6.9-ఇంచ్​ ఫ్లాట్ హెచ్​డీ+ డిస్‌ప్లే, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో మార్కెట్లో మంచి గుర్తింపు పొందింది. ఆ ఫోన్ 6ఎన్​ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

పోకో సీ85ఎక్స్​ 5జీ: డిజైన్, ఫీచర్లు..

ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ప్రకారం.. రాబోయే పోకో సీ85ఎక్స్​ 5జీ స్టైలిష్ 'డ్యూయల్-టోన్' రియర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఎడమ వైపు కింద 'Poco' బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 'గోల్డ్' కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. మరిన్ని కలర్​ ఆప్షన్స్​ కూడా ఉండొచ్చు.

ముఖ్యంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో పిల్‌-షేప్ కెమెరా ఐలాండ్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. దీని పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఇతర ముఖ్య ఫీచర్లు ప్రస్తుతం గోప్యంగా ఉన్నప్పటికీ, కంపెనీ విడుదల చేసిన మార్కెటింగ్ మెటీరియల్స్ ప్రకారం ఇందులో 'మాసివ్ బ్యాటరీ' (భారీ బ్యాటరీ) ఉండబోతోందని స్పష్టమవుతోంది.

ఇక లాంచ్​ నాటికి ఈ పోకో సీ85ఎక్స్​ 5జీకి సంబంధించిన ధర, ఫీచర్స్​ వంటి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

పోకో సీ85 (గత మోడల్​)- ధర, వివరాలు..

పోకో సీ85 5జీ బేస్ వేరియంట్ (4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గతంలో రూ. 12,499 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మిస్టిక్ పర్పుల్, పవర్ బ్లాక్, స్ప్రింగ్ గ్రీన్ రంగుల్లో విక్రయించబడుతోంది.

గుర్తుచేసుకుంటే, పోకో సీ85 5జీలో 6.9-ఇంచ్​ హెచ్​డీ+ (720x1,600 పిక్సెల్స్) డిస్‌ప్లే, 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ధూళి, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఉన్నాయి. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6,000ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

అయితే, కొత్తగా రాబోతున్న 'సీ85ఎక్స్​ 5జీ' స్మార్ట్​ఫోన్​లో దీనికంటే మెరుగైన అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More