Realme C83 5G : రూ. 13,499కే.. రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్​- 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో! సేల్​ షురూ..

Realme C83 5G : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ.. భారత మార్కెట్​లో తన బడ్జెట్ ఫ్రెండ్లీ సీ-సిరీస్‌కి చెందిన సీ83 స్మార్ట్​ఫోన్​ సేల్​ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 7, 2026, 15:30:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో సీ83 5జీ పేరుతో కొత్త స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసిన రియల్​మీ సంస్థ.. ఇప్పుడు ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​ సేల్​ని ప్రారంభించింది. ఈ రియల్​మీ సీ83 5జీ స్మార్ట్​ఫోన్ రెండు రంగుల్లో, మూడు వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

రియల్​మీ సీ83 5జీ..
రియల్​మీ సీ83 5జీ..

రియల్‌మీ సీ83 5జీ: ధర- లభ్యత..

భారతదేశంలో ఈ రియల్‌మీ సీ83 5జీ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి:

4 GB RAM + 64 GB స్టోరేజ్ (బేస్ వేరియంట్): రూ. 13,499

4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్: రూ. 14,499

6 GB RAM + 128 GB స్టోరేజ్ (టాప్-ఎండ్ వేరియంట్): రూ. 17,499

సేల్ వివరాలు: ఈ లేటెస్ట్ స్మార్ట్​ఫోన్ భారత్‌లో మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి రానుంది. వినియోగదారులు దీనిని ఆరు నెలల వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్​ఫోన్​ బ్లూమింగ్​ పర్పుల్​, స్ప్రౌటింగ్​ గ్రీన్​ రంగుల్లో లభిస్తుంది.

రియల్​మీ సీ83 5జీ- స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 ఇంచ్​ హెచ్​డీ+ (720x1,570 పిక్సెల్స్) ఎల్​సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 16.7 మిలియన్ రంగులు, 180 హెచ్​జెడ్​ టచ్ సాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్: ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది (6 ఎన్​ఎం ప్రాసెస్). దీనికి తోడు ARM Mali-G57 MC2 GPU, 6 GB వరకు LPDDR4x RAM, 128 GB వరకు eMMC 5.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

కెమెరా: రియల్​మీ సీ83 5జీ వెనుక భాగంలో ఒకే ఒక కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఎఫ్​/2.2 అపెర్చర్ కలిగిన 13-మెగాపిక్సెల్ షూటర్ ఉంది. ఇది 77-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆటోఫోకస్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఎఫ్​/2.2 అపెర్చర్‌తో కూడిన 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు కెమెరాల ద్వారా 1080పీ/30 ఎఫ్​పీఎస్​ వేగంతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

బ్యాటరీ అండ్​ ఛార్జింగ్: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని భారీ 7,000 ఎంఏహెచ్​ టైటాన్​ బ్యాటరీ. ఇది 15 డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 పై రన్ అవుతుంది.

కనెక్టివిటీ: ఇందులో 5జీ, 4జీ ఎల్​టీఈ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బేడౌ, జీపీఎస్​, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్​ఎస్​ఎస్​ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

సెన్సార్లు: ఈ రియల్​మీ సీ83 5జీలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, యాక్సిలరోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఫోన్ కొలతలు 166.3×78.1×8.4 ఎంఎం, బరువు సుమారు 212 గ్రాములు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More