Vivo V70 : 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ట్రిపుల్ కెమెరాతో వివో నుంచి 2 కొత్త స్మార్ట్‌ఫోన్స్..
కెమెరా ప్రియుల కోసం వివో తన పాపులర్ వీ-సిరీస్‌లో వీ70, వీ70 ఎలైట్ మోడళ్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. భారీ బ్యాటరీ, జైస్ కెమెరాలు, సరికొత్త ప్రాసెసర్లతో వచ్చిన ఈ గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్-రేంజ్ కెమెరా ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వివో.. తన వీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. వివో వీ60కి సక్సెసర్‌గా వివో వీ70, వివో వీ70 ఎలైట్ అనే మోడళ్లను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. ఈసారి ప్రత్యేకంగా 'ఎలైట్' వేరియంట్‌ను పరిచయం చేస్తూ, అందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌ను అందించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

వివో వీ70, వీ70 ఎలైట్- ధర, లభ్యత..
భారత్‌లో స్టోరేజ్ వేరియంట్లను బట్టి వివో వీ70, వీ70 ఎలైట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
వివో వీ70 ఎలైట్:
8జీబీ + 256జీబీ: రూ. 51,999
12జీబీ + 256జీబీ: రూ. 56,999
12జీబీ + 512జీబీ: రూ. 61,999
రంగులు: ప్యాషన్ రెడ్, శాండ్ బీజ్, ఆథెంటిక్ బ్లాక్.
వివో వీ70:
8జీబీ + 256జీబీ: రూ. 45,999
12జీబీ + 256జీబీ: రూ. 49,999
రంగులు: ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో.
వివో వీ70, వీ70 ఎలైట్- డిజైన్, డిస్‌ప్లే..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఫ్లాట్ ఎడ్జెస్, వెనుక భాగంలో స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తాయి. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్లతో ప్రీమియం లుక్ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్ ఉండటం వల్ల నీరు, ధూళి నుంచి గరిష్ట రక్షణ లభిస్తుంది.
స్క్రీన్: 6.59- ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 1.5కే రిజల్యూషన్.
ఫీచర్లు: 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా దీనిని రూపొందించారు.
వివో వీ70, వీ70 ఎలైట్- ప్రాసెసర్, పర్ఫార్మెన్స్..
ఈ సిరీస్‌లో ప్రధాన మార్పు ప్రాసెసర్ల విషయంలోనే జరిగింది:
వీ70 ఎలైట్: ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ వాడారు. వీ-సిరీస్‌లో 8-సిరీస్ చిప్‌సెట్ రావడం ఇదే తొలిసారి. దీనికి తోడు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అదనపు బలాన్ని ఇస్తాయి.
స్టాండర్డ్ వీ70: ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది రోజువారీ పనులు, గేమింగ్‌ను సునాయాసంగా హ్యాండిల్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6 పై ఇవి పనిచేస్తాయి. వివో వీటికి ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ప్రకటించింది.
వివో వీ70, వీ70 ఎలైట్ కెమెరా: జైస్ మాయాజాలం..
ఫోటోగ్రఫీకి ప్రాధాన్యత ఇచ్చే వివో, రెండు మోడళ్లలోనూ ఒకే రకమైన కెమెరా సెటప్‌ను అందించింది:
రియర్ కెమెరా: 50ఎంపీ జైస్ నైట్ టెలిఫోటో సెన్సార్ + 50ఎంపీ జైస్ ఓఐఎస్ మెయిన్ కెమెరా + 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్.
సెల్ఫీ: 50ఎంపీ జైస్ ఫ్రంట్ కెమెరా (92-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ).
ఏఐ ఫీచర్లు: 4కే వీడియో రికార్డింగ్‌తో పాటు ఏఐ ఫ్లోరల్, ఏఐ వెదర్ మ్యాజిక్, ఏఐ హోలీ పోర్ట్రెయిట్ వంటి స్పెషల్ టూల్స్ ఉన్నాయి.
వివో వీ70, వీ70 ఎలైట్- బ్యాటరీ, ఇతర ఫీచర్లు..
రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 11 గంటల నావిగేషన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్ తగ్గించడానికి 'బైపాస్ ఛార్జింగ్' సౌకర్యం కూడా ఉంది. గేమింగ్ కోసం ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, వేగవంతమైన 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ 2.0 ఇందులో ఆకర్షణీయమైన అంశాలు.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న: వివో వీ70, వీ70 ఎలైట్ మోడళ్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏంటి?
సమాధానం: ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న అతిపెద్ద తేడా ప్రాసెసర్. వివో వీ70 ఎలైట్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. అదే స్టాండర్డ్ వీ70 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే రంగుల ఎంపికలో కూడా చిన్నపాటి మార్పులు ఉన్నాయి (ఎలైట్ వేరియంట్‌లో ఆథెంటిక్ బ్లాక్, శాండ్ బీజ్ వంటి అదనపు రంగులు ఉన్నాయి). మిగిలిన డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ ఫీచర్లు రెండింటిలోనూ ఒకేలా ఉంటాయి.
ప్రశ్న: ఈ స్మార్ట్‌ఫోన్ల కెమెరాలో ఉన్న ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లు ఏంటి?
సమాధానం- వివో వీ70 సిరీస్ జైస్ (Zeiss) ఆప్టిక్స్‌తో పాటు మూడు సరికొత్త ఏఐ టూల్స్‌ను పరిచయం చేసింది. 1. ఏఐ ఫ్లోరల్: పూల ఫోటోలను మరింత సహజంగా, స్పష్టంగా తీయడానికి సహాయపడుతుంది. 2. ఏఐ వెదర్ మ్యాజిక్: ఫోటో తీసేటప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లైటింగ్, ఎఫెక్ట్‌లను అడ్జస్ట్ చేస్తుంది. 3. ఏఐ హోలీ పోర్ట్రెయిట్: పండగ సందర్భాల్లో రంగులతో కూడిన ఫోటోలను అద్భుతంగా క్యాప్చర్ చేయడానికి ఇది పనికొస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


