200ఎంపీ కెమెరాతో పవర్ఫుల్ Vivo X300 స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్- ధర, ఫీచర్స్ ఇవే..
200ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ పవర్ఫుల్ ప్రాసెసర్‌తో Vivo X300 స్మార్ట్‌ఫోన్ సిరీస్ అంతర్జాతీయంగా లాంచ్ అయ్యింది. ఇందులోని రెండు గ్యాడ్జెట్స్, వాటి ధరలు, ఫీచర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
వివో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ని తాజాగా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. దాని పేరు వివో ఎక్స్300. ఇందులో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి.. వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో. పలు నివేదికల ప్రకారం.. ఈ వివో ఎక్స్300 సిరీస్ భారతదేశంలో డిసెంబర్ ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది! ఈ నేపథ్యంలో ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్300 స్మార్ట్‌ఫోన్ సిరీస్- ధర, లభ్యత..
వివో ఎక్స్300 ప్రో ఏకైక వేరియంట్ (16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్) ధర ఈయూఆర్ 1,399 (భారత కరెన్సీలో సుమారు రూ.1,43,000)గా నిర్ణయించారు!
మరోవైపు, వివో ఎక్స్300 స్మార్ట్‌ఫోన్ ధర ప్రారంభ మోడల్ (12జీబీ ర్యమ్, 256జీబీ స్టోరేజ్) కోసం ఈయూఆర్ 1,049 (సుమారు రూ. 1,08,000) నుంచి మొదలవుతుంది. దీని టాప్-ఎండ్ వేరియంట్ (16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్) ధర ఈయూఆర్ 1,099 (సుమారు రూ. 1,13,000)గా ఉంది.
ఈ వివో ఎక్స్300 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ నవంబర్ 3 నుంచి యూరప్‌లో కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. వివో ఎక్స్300 ప్రో మోడల్ డూన్ బ్రౌన్, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. వివో ఎక్స్300 మాత్రం హలో పింక్, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
వివో ఎక్స్300 ప్రో- ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
డ్యూయెల్-సిమ్ సపోర్ట్ ఉన్న వివో ఎక్స్300 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్6పై పనిచేస్తుంది. ఇది 6.78-ఇంచ్ 1,260x2,800 పిక్సెల్స్ ఫ్లాట్ క్యూ10+ ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో 1.07 బిలియన్ రంగులు, 452పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. డిస్‌ప్లే P3 కలర్ గ్యాముట్, హెచ్డీఆర్కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 94.85 శాతంగా ఉంది.
ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 3ఎన్ఎం టెక్నాలజీతో రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఆక్టా-కోర్ చిప్‌తో పనిచేస్తుంది. ఇది 4.21జీహెచ్‌జెడ్ గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. దీనికి మాలీ G1-అల్ట్రా జీపీయూ, గరిష్టంగా 16జీబీ LPDDR5X అల్ట్రా ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కనెక్ట్ చేసి ఉంటుంది. మెరుగైన ఇమేజింగ్ కోసం ప్రత్యేకంగా వీ3+ ఇమేజింగ్ చిప్ కూడా ఇందులో ఉంది.
వివో ఎక్స్300 ప్రో వేరియంట్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో (ఎఫ్/1.57) అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, (ఎఫ్/2.0) అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, (ఎఫ్/2.67) అపెర్చర్‌తో 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి. ఈ పెరిస్కోప్ కెమెరా ద్వారా గరిష్టంగా 100ఎక్స్ డిజిటల్ జూమ్ చేయవచ్చు. ముందువైపు హోల్-పంచ్ కటౌట్‌లో (f/2.0) అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక కెమెరా సెటప్ ఏకంగా 8కే రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదు.
సెక్యూరిటీ, కనెక్టివిటీ: భద్రత కోసం 3డీ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికల్లో వైఫ్ 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, జీపీయూ ఉన్నాయి. ఇందులో లేజర్ ఆటోఫోకస్ సెన్సార్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్, మల్టీస్పెక్ట్రల్ సెన్సార్ వంటి ఇతర సెన్సార్‌లు కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 5,440ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 90డబ్ల్యూ వైర్డ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ గ్యాడ్జెట్లో డ్యూయల్ స్పీకర్ సెటప్, x-axis లీనియర్ మోటార్, యాక్షన్ బటన్, సిగ్నల్ యాంప్లిఫైయర్ చిప్ ఉన్నాయి. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. ప్రో మోడల్ కొలతలు 161.98×75.48×7.99ఎంఎం, బరువు సుమారు 226 గ్రాములు.
వివో ఎక్స్300- ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ వివో ఎక్స్300.. దాని ప్రో వేరియంట్ మాదిరిగానే చిప్, ఆపరేటింగ్ సిస్టమ్, కనెక్టివిటీ ఎంపికలు, భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.
వివో ఎక్స్300 మోడల్‌లో 6.78-ఇంచ్ ప్రో డిస్‌ప్లేకు బదులుగా 6.31-ఇంచ్ 1,216x2,640 పిక్సెల్స్ ఫ్లాట్ క్యూ10+ ఎల్టీపీఓ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అమర్చారు. అయితే, డిస్‌ప్లేలోని ఇతర ఫీచర్లు మాత్రం ఒకేలా ఉన్నాయి. అలాగే, వివో ఎక్స్300లో ఉన్న 5,440ఎంఏహెచ్ బ్యాటరీకి బదులుగా, ఈ ఫోన్‌లో 5,360ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఇందులో కూడా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంది. అయితే, వివో ఎక్స్300లో ఓఐఎస్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి. ప్రో, సాధారణ మోడల్స్ రెండింటిలోనూ ఒకే రకమైన సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ గ్యాడ్జెట్ బరువు సుమారు 190 గ్రాములు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


