...
...
Next Story

Volkswagen Virtus : వోక్స్‌వ్యాగన్ వర్టుస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ అవుట్.. మరింత స్పోర్టీగా!

భారత మార్కెట్లో ఆసక్తి రేకెత్తిస్తున్న వోక్స్‌వ్యాగన్ వర్టుస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ విడుదలయ్యింది. కొత్త డిజైన్, స్పోర్టీ జీటీ లైన్, సవరించిన గేర్‌బాక్స్ ఆప్షన్లతో రాబోతున్న ఈ కారు విశేషాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 5, 2026, 12:21:12 IST
Advertisement

భారతీయ ప్రీమియం సెడాన్ మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జర్మన్ కార్ల తయారీ దిగ్గజం ‘వోక్స్‌వ్యాగన్’ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. దేశీయ రోడ్లపై విజయవంతంగా దూసుకుపోతున్న తమ వర్టుస్ మోడల్‌ను మరింత అట్రాక్టివ్‌గా తీర్చిదిద్ది ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. లాంచ్‌కు ముందే వాహన ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ కంపెనీ ఈ కారు మొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది.

వోక్స్​వ్యాగన్ వర్టుస్ ఫేస్​లిఫ్ట్ టీజర్..
వోక్స్​వ్యాగన్ వర్టుస్ ఫేస్​లిఫ్ట్ టీజర్..

ఈ నేపథ్యంలో ఈ వోక్స్​వ్యాగన్ వర్టుస్ ఫేస్​లిఫ్ట్​ సెడాన్​కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

వోక్స్​వ్యాగన్ వర్టుస్ ఫేస్​లిఫ్ట్​- డిజైన్..

వోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ కారు ముందు భాగంలో ప్రధాన మార్పులు చేశారు. సన్నటి ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, వాటి చుట్టూ ఉండే డే-టైమ్ రన్నింగ్ లైట్లు కారుకు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. గ్రిల్ మధ్యలో ఐకానిక్ వోక్స్‌వ్యాగన్ లోగోతో పాటు ఒక వైపు ఎరుపు రంగు 'జీటీ' బ్యాడ్జ్ అమర్చారు.

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో నడుస్తున్న కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ ట్రెండ్‌ను ఈ వోక్స్​వ్యాగన్ వర్టుస్ ఫేస్​లిఫ్ట్​ అనుసరించకపోవడం విశేషం. దానికి బదులుగా సాంప్రదాయ శైలిలోనే విడివిడిగా ఉండే హెడ్‌లాంప్స్, గ్రిల్ డిజైన్‌ను కొనసాగించారు.

బంపర్ డిజైన్: ముందు భాగం బంపర్‌ను రీడిజైన్ చేసి విస్తృతమైన ఎయిర్ ఇంటెక్ అందించారు. ఫాగ్ లాంప్ స్థానంలో హారిజాంటల్ ఇన్సర్ట్స్ పొందుపరిచి మరింత స్పోర్టీ క్యారెక్టర్‌ను జోడించారు.

ఎక్స్‌టీరియర్ రంగులు: వర్టుస్ ఫేస్​లిఫ్ట్ టీజర్​లో ప్రదర్శించిన జీటీ వేరియంట్ డార్క్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్ హౌసింగ్స్, రాయల్ బ్లూ బాడీ కలర్‌తో ఆకట్టుకుంటోంది.

వర్టుస్ ఇంటీరియర్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా రహస్యంగానే ఉంచినప్పటికీ, క్యాబిన్ లోపల ప్రీమియం డాష్‌బోర్డ్, సరికొత్త లెథరెట్ సీట్ అప్‌హోల్‌స్టరీ అందుబాటులోకి రానున్నాయి.

స్క్రీన్స్ అండ్ టెక్నాలజీ: 10.25-అంగుళాల పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనున్నాయి.

సేఫ్టీ అండ్ ప్రాక్టికాలిటీ: పార్కింగ్ సులువు చేసేందుకు 360-డిగ్రీ కెమెరా ఆప్షన్‌ను కూడా ఈ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

వోక్స్​వ్యాగన్ వర్టుస్ ఫేస్​లిఫ్ట్​- పవర్​ఫుల్ ఇంజిన్..

ఇంజిన్ విషయానికి వస్తే ఇదివరకు ఉన్న పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఆప్షన్లనే ఫోక్స్‌వ్యాగన్ కొనసాగించనుంది:

1.0-లీటర్ టీఎస్​ఐ టర్బో పెట్రోల్: ఇది 115 హెచ్​పీ పవర్, 178 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌లో తెచ్చిన అతిపెద్ద మెకానికల్ మార్పు ఏంటంటే.. పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం.

1.5-లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్: ఇది 150 హెచ్​పీ పవర్, 250 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనితో విమర్శకుల ప్రశంసలు పొందిన 7-స్పీడ్ డీఎస్‌జీ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ లభించనుంది.

వోక్స్‌వ్యాగన్ వర్టుస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్​ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks