...
...
Next Story

MG Hector Tomahawk EV కొంటున్నారా? మీ నెలవారీ ఈఎంఐ ఖర్చులు ఇలా..

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ కొత్త హెక్టర్ టోమాహాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసింది. రూ. 19.49 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ 7-సీటర్ ఈవీ మోడళ్ల ధరలు, బీఏఏఎస్ ప్లాన్లతో పాటు నెలవారీ ఈఎంఐ లెక్కల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 29, 2026, 07:28:12 IST
Advertisement

భారత ఎలక్ట్రిక్ వాహన విపణిలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కంపెనీ తన నయా 7-సీటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ'ని భారత మార్కెట్లో ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు పొందిన వూలింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా, సంస్థ సరికొత్త ‘అడాప్ట్’ ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించారు. ఎలక్ట్రిక్ వేరియంట్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా ఎంజీ ఒకేసారి మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ..
ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ..

మరి మీరు ఈ ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీని కొనుగోలు చేయాలనుకుంటే.. నెలవారీ ఈఎంఐ ఎంత అవుతుంది? ఇక్కడ తెలుసుకోండి..

వేరియంట్లు.. ఎక్స్-షోరూమ్ ధరలు

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. రూ. 19.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభించే ఈ ఎస్‌యూవీ వివిధ వేరియంట్లలో లభిస్తోంది:

7-సీటర్ ఎక్సైట్ : రూ. 19.49 లక్షలు

7-సీటర్ ఎక్స్‌క్లూజివ్ : రూ. 21.99 లక్షలు

7-సీటర్ ఎస్సెన్స్ : రూ. 23.49 లక్షలు

5-సీటర్ ఎస్సెన్స్ : రూ. 22.99 లక్షలు

69.2 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.

రూ. 13.99 లక్షలకే ఈవీ.. బీఏఏఎస్ ఆఫర్ వివరాలు

వాహనం కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు భారం ఎక్కువగా పడకూడదనుకునే వారి కోసం ఎంజీ సంస్థ 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే కారు ప్రారంభ ముందస్తు ధర రూ. 13.99 లక్షలకే దిగివస్తుంది. అయితే బ్యాటరీ వాడకానికి కిలోమీటరుకు రూ. 4.90 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

నెలవారీ ఈఎంఐ ఎంత పడుతుంది?

ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ: నెలవారీ ఈఎంఐ లెక్కలు
మోడల్, వేరియంట్లోన్ (100% ఎక్స్​షోరూం ధర)వడ్డీ రేటురీపేమెంట్ టెన్యూర్నెలవారీ ఈఎంఐ
MG Hector Tomahawk EV Excite 7-seaterరూ. 19.49 లక్షలు9.5%60 నెలలురూ. 40,933
MG Hector Tomahawk EV Exclusive 7-seaterరూ. 21.99 లక్షలురూ. 46,183
MG Hector Tomahawk EV Essence 5-seaterరూ. 22.99 లక్షలురూ. 48,283
MG Hector Tomahawk EV Essence 7-seaterరూ. 23.49 లక్షలురూ. 49,333
View All

అయితే బ్యాంకు ఆఫర్లు, మీరు చెల్లించే డౌన్ పేమెంట్ మొత్తం, ఎంచుకునే కాలపరిమితి, రుణ వడ్డీ రేట్లను బట్టి ఈ ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ ఈఎంఐ మొత్తంలో మార్పులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్, టాటా హారియర్ ఈవీలకు గట్టి పోటీగా వచ్చిన ఈ మోడల్ డెలివరీలు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe