...
...
Next Story

Android Pulse app : ప్లే స్టోర్​లో ప్రత్యక్షమైన ఆండ్రాయిడ్ పల్స్​ యాప్- ఏంటిది? ఏం పనిచేస్తుంది?

గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ పల్స్ అనే కొత్త యాప్ కనిపించడంతో యూజర్లు ఆందోళన చెందారు. అయితే ఇది హానికరమైన యాప్ కాదని, ఫోన్ పనితీరును మెరుగుపరిచే అధికారిక గూగుల్ సిస్టమ్ అప్లికేషన్ అని తేలింది.

Published on: Aug 23, 2026, 08:21:14 IST
Advertisement

ఆండ్రాయిడ్ యూజర్లు తమ గూగుల్ ప్లే స్టోర్ అప్‌డేట్ క్యూను పరిశీలిస్తున్న సమయంలో ఒక కొత్త యాప్ కనిపించి ఆశ్చర్యపరుస్తోంది. ఎలాంటి గుర్తులు లేని సాధారణ, ఖాళీ ఐకాన్‌తో “ఆండ్రాయిడ్ పల్స్” అనే అప్లికేషన్ ప్రత్యక్షమైంది. తమ ఫోన్లలోకి ఏదైనా అనధికారిక యాప్ చొరబడిందా అనే అనుమానంతో యూజర్లలో కాస్త ఆందోళన, కుతూహలం వ్యక్తమయ్యాయి. అయితే ప్లే స్టోర్ వివరాలను నిశితంగా పరిశీలిస్తే, ఇది ఎలాంటి హానికారక యాప్​ కాదని, గూగుల్ విడుదల చేసిన అధికారిక ఫస్ట్-పార్టీ సిస్టమ్ అప్లికేషన్ అని స్పష్టమైంది.

అసలు ఈ ఆండ్రాయిడ్ పల్స్ ఏం చేస్తుంది?

ఆండ్రాయిడ్​ పల్స్​ యాప్..
ఆండ్రాయిడ్​ పల్స్​ యాప్..

ప్లే స్టోర్‌లోని గూగుల్ అధికారిక వివరణ ప్రకారం.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లలోని కీలకమైన సిస్టమ్ రిసోర్స్ వినియోగంలో లోపాలను గుర్తించడానికి ఈ సర్వీస్ నిబంధనలను పంపిణీ చేస్తుంది.

ఈ అనూహ్య అప్‌డేట్ గురించి ప్రముఖ టెక్ పబ్లికేషన్ ‘నైన్ టూ ఫైవ్ గూగుల్’ వివరిస్తూ.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఇది ఒక బ్యాక్‌గ్రౌండ్ డయాగ్నస్టిక్ యూటిలిటీగా పనిచేస్తుందని తెలిపింది. గూగుల్ పేర్కొన్న "క్రిటికల్ సిస్టమ్ రిసోర్స్ వినియోగం" అంటే.. బ్యాటరీ డ్రైనేజ్, ప్రాసెసర్ వర్క్‌లోడ్, మెమరీ వాడకంలో జరిగే అసాధారణ హెచ్చుతగ్గులను ఇది గమనిస్తుంది. సిస్టమ్ సర్వీసులు, థర్డ్-పార్టీ యాప్‌లలో ఈ సమస్యలను ట్రాక్ చేస్తుంది. పరికరాలకు డైనమిక్‌గా రూల్స్‌ను పంపిణీ చేయడం ద్వారా, యూజర్ అనుభవాన్ని దెబ్బతీసే సాఫ్ట్‌వేర్ బగ్‌లను, పనితీరు మందగించే సమస్యలను ఆండ్రాయిడ్ ముందుగానే గుర్తించడానికి ఈ యాప్ సహాయపడుతుంది.

హానికారక యాప్​ కాదు.. అత్యవసర సిస్టమ్ టూల్!

ప్లే స్టోర్‌లో యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అప్‌డేట్‌గా ఆండ్రాయిడ్ పల్స్ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారైనప్పటికీ, ఈ బ్యాక్‌గ్రౌండ్ సర్వీస్ కొత్తదేమీ కాదని 9to5Google వెల్లడించింది. ఏపికే మిర్రర్ వెర్షన్ చరిత్ర డేటా ప్రకారం.. com.google.android.apps.pulse గా పేర్కొన్న ఈ యాప్ ప్యాకేజీ 2026 మార్చి నుంచే అందుబాటులో ఉంది. ప్లే స్టోర్‌లో పబ్లిక్‌గా లిస్ట్ చేయడానికి ముందే ఇది కనీసం ఏడు ఇంటర్నల్ బిల్డ్‌లను పూర్తి చేసుకుంది. గూగుల్ పిక్సెల్ డివైజ్‌లలో ఈ యూటిలిటీ ఇప్పటికే ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంది.

ప్లే స్టోర్‌లో ఇప్పటికే 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నప్పటికీ, గూగుల్ ఇంతకాలం ఈ సర్వీస్‌ను తెరవెనుక నిశ్శబ్దంగా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. అయితే సిస్టమ్- స్థాయి డయాగ్నస్టిక్ ప్యాచెస్‌ను పంపిణీ చేసే విధానంలో గూగుల్ చేసిన చిన్న సర్దుబాటు వల్లే ఇది మ్యాన్యువల్ అప్‌డేట్ జాబితాలో అకస్మాత్తుగా కనిపిపించిందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ప్లే స్టోర్ అప్‌డేట్స్‌లో "ఆండ్రాయిడ్ పల్స్" కనిపించిన యూజర్లు ఎలాంటి భయం లేకుండా ఆ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్‌లు సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించిన అసలైన గూగుల్ డెవలప్డ్ టూల్ ఇది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe