...
...
Next Story

సెర్చ్​ చేయకుండానే స్టిక్కర్లు పంపొచ్చు! వాట్సాప్​లో కొత్త ఫీచర్​..

వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త 'స్టిక్కర్ సజెషన్' ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీనివల్ల చాటింగ్ మరింత వేగంగా, సరదాగా మారనుంది. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా డాక్టర్ల కోసం వాట్సాప్ ఏఐ సేవలను ప్రారంభించింది.

Published on: Jan 13, 2026, 16:01:00 IST
Advertisement

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం చాటింగ్‌ను మరింత సులభతరం చేసే పనిలో పడింది. మనం మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడే దానికి తగిన స్టిక్కర్లను వాట్సాప్ స్వయంగా సూచించే సరికొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. తాజాగా ఐఓఎస్ బీటా వెర్షన్‌లోనూ ప్రత్యక్షమైంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

త్వరలోనే వాట్సాప్​ కొత్త ఫీచర్​..
త్వరలోనే వాట్సాప్​ కొత్త ఫీచర్​..

దీనిని స్టిక్కర్ సజెషన్ ఫీచర్‌ అని పిలుస్తున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా మనం వాట్సాప్​లో ఎవరికైనా స్టిక్కర్ పంపాలంటే.. ముందుగా స్టిక్కర్ ట్రే ఓపెన్ చేసి, మనకు నచ్చిన దాని కోసం వెతకాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో ఆ శ్రమ తప్పుతుంది! స్నాప్‌చాట్‌లో ఉన్న తరహాలోనే, మీరు వాట్సాప్​లో మెసేజ్ బార్‌లో టైప్ చేస్తున్నప్పుడే సందర్భానికి తగ్గ స్టిక్కర్లు పైన కనిపిస్తాయి.

ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

బీటా టెస్టింగ్ నివేదికల ప్రకారం.. మీరు చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఎమోజీని టైప్ చేస్తే, దానికి సరిపోయే స్టిక్కర్లు ఏవైనా ఉన్నాయా అని వాట్సాప్ వెతుకుతుంది. ఒకవేళ ఉంటే, వెంటనే ఆ స్టిక్కర్ ఆప్షన్ టెక్ట్స్​ బార్ దగ్గర కనిపిస్తుంది. మీరు కేవలం ఒక్క క్లిక్‌తో ఆ స్టిక్కర్‌ను అవతలి వారికి పంపవచ్చు.

మాటల్లో చెప్పలేని భావాలను స్టిక్కర్ల ద్వారా పంపే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఇది కొద్దిమంది బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

  • అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​లో ఐఫోన్​ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఏపీ మెడికల్ కౌన్సిల్ సరికొత్త చొరవ..

ఇకపై డాక్టర్లు రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, క్రెడిట్ పాయింట్లు, అపాయింట్‌మెంట్ బుకింగ్‌ల సమాచారం కోసం విజయవాడలోని కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం 9030999616 అనే వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. వైద్యులకు మార్గదర్శకత్వం చేసేందుకు చిన్న సందేశాలు మరియు వీడియోలను కూడా ఈ ఏఐ సిస్టమ్ ద్వారా అందుబాటులో ఉంచారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks