అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​లో ఐఫోన్​ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​..

జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jan 13, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐఫోన్ కొనాలని కలలు కనేవారికి అమెజాన్ ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026'లో యాపిల్ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు - ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సరికొత్త ఐఫోన్ ఎయిర్​పై భారీ ఆఫర్లను ప్రకటించింది. 2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ప్రీమియం ఫోన్లపై అమెజాన్ ఇప్పుడు భారీ ప్రైజ్​ కట్​ని అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్​ 17 ప్రోతో ఓ మహిళ..
ఐఫోన్​ 17 ప్రోతో ఓ మహిళ..

అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​ 2026- ఆఫర్ల వివరాలు..

అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఉంచిన మైక్రోసైట్ ప్రకారం, ఈ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్‌ 2026లో ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేవలం నేరుగా వచ్చే డిస్కౌంట్లు మాత్రమే కాకుండా, ఎస్బీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్​స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు పాత ఫోన్లను ఎక్స్​ఛేంజ్​ చేసేవారికి ‘ఎక్స్​ఛేం బోనస్’, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​ 2026- ఐఫోన్​ 17 గ్యాడ్జెట్స్​పై ఆఫర్ల వివరాలు..

ఐఫోన్ 17 ప్రో మాక్స్: దీని అసలు ధర రూ. 1,49,900 కాగా, సేల్‌లో కేవలం రూ. 1,40,400 కే లభ్యం కానుంది.

ఐఫోన్ 17 ప్రో: లాంచ్ సమయంలో రూ. 1,34,900 గా ఉన్న ఈ ఫోన్ ధర సేల్‌లో రూ. 1,25,400 కు తగ్గనుంది.

ఐఫోన్ ఎయిర్: స్లిమ్ డిజైన్‌తో వచ్చిన ఈ కొత్త మోడల్ ధర రూ. 99,000 నుండి రూ. 91,249 కి తగ్గింది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఈ మూడు ఫోన్లు యాపిల్​కి చెందిన పవర్‌ఫుల్ 'ఏ19 ప్రో' చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. అయితే ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను చాలా స్లిమ్​గా రూపొందించడం వల్ల, హీటింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు అందులోని చిప్‌సెట్ వేగాన్ని స్వల్పంగా తగ్గించారు. కెమెరా విషయానికి వస్తే ప్రో సిరీస్‌లో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండగా, ఐఫోన్ ఎయిర్‌లో ఒకే ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కానీ సెల్ఫీల కోసం మూడింటిలోనూ 18 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

ఒక్క ఐఫోన్ మాత్రమే కాదు, ఈ సేల్‌లో వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్, శాంసంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఎం17 వంటి పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై కూడా అద్భుతమైన డీల్స్ ఉండనున్నాయి. మీరు గ్యాడ్జెట్లు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ వారం అమెజాన్ వైపు ఒక కన్నేసి ఉంచండి.

వీటిపైనా ఆఫర్లు..

బోట్ ఎయిర్‌డోప్స్ 219: నిత్యం ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి ఇది చక్కని ఎంపిక. ఇందులో ఉన్న నాలుగు మైకులు (ENx టెక్నాలజీ) ట్రాఫిక్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ మీ గొంతు అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా చేస్తాయి. 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో వారమంతా వాడుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై 73 శాతం భారీ తగ్గింపు ఉంది.

లెనోవో యోగా స్లిమ్ 7: పనిలో వేగం కోరుకునే వారి కోసం ఈ ల్యాప్‌టాప్ రూపొందించారు. కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్‌తో మల్టీ టాస్కింగ్ చాలా సులభం. 1.39 కిలోల బరువుతో బ్యాగ్‌లో ఈజీగా ఇమిడిపోతుంది. ప్రస్తుతం 26 శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్, సేల్‌లో మరింత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది.

అమెరికా గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​ 2026లో మరిన్ని ఆఫర్ల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More