7000ఎంఏహెచ్​ బ్యాటరీతో Oppo Reno 15c- ట్రిపుల్​ కెమెరా సెటప్​ కూడా! ధర ఎంతంటే..

ఒప్పో తన పాపులర్ రెనో సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'రెనో 15సీ 5జీ'ని భారత్‌లో లాంచ్​ చేసింది. భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ అందరిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ధర సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 10, 2026, 10:40:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒప్పో రెనో 15 సిరీస్​లో భాగంగా కొత్త స్మార్ట్​ఫోన్​ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. దాని పేరు ఒప్పో రెనో 15సీ. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. స్టాండర్డ్, ప్రో మోడల్స్‌తో పాటు వచ్చిన ఈ ఫోన్.. ముఖ్యంగా తన భారీ బ్యాటరీ పవర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మిగతా మోడల్స్ ఈ నెలలోనే అమ్మకానికి వస్తుండగా, '15సీ' వేరియంట్ మాత్రం ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​కి సంబంధించిన ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఒప్పో రెనో 15సీ 5జీ స్మార్ట్​ఫోన్​..
ఒప్పో రెనో 15సీ 5జీ స్మార్ట్​ఫోన్​..

ఒప్పో రెనో 15సీ- ధర, లభ్యత..

బడ్జెట్ అంచనాలకు తగ్గట్టుగానే ఒప్పో ఈ రెనో 15సీ 5జీ స్మార్ట్​ఫోన్ ధరను నిర్ణయించింది.

8జీబీ ర్యామ్​ + 256జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర: రూ. 34,999

12జీబీ ర్యామ్​ + 256జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర: రూ. 37,999

ఈ ఫోన్ 'ఆఫ్టర్ గ్లో పింక్', 'ట్విలైట్ బ్లూ' రంగుల్లో లభిస్తుంది. మీరు దీన్ని ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఫిబ్రవరిలో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 15సీ- బ్యాటరీ..

ఈ ఒప్పో రెనో 15సీ స్మార్ట్​ఫోన్​లోని ప్రధాన ఆకర్షణ దీని భారీ 7,000ఎంఏహెచ్​ బ్యాటరీ అని చెప్పుకోవాలి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ చూస్తుంటాం, కానీ ఇటీవలి కాలంలో 6000, 7000ఎంఏహెచ్​ సామర్థ్యం గల గ్యాడ్జెట్స్​ వస్తున్నాయి. ఈ రెనో 15సీ కూడా వీటిల్లో ఒకటి. అంతేకాదు, బ్యాటరీకి దీనికి తోడు 80డబ్ల్యూ సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చన్నమాట.

ఒప్పో రెనో 15సీ- డిస్​ప్లే, పర్ఫార్మెన్స్..

చూడగానే కట్టిపడేసేలా ఉండే 6.57 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోలెడ్ డిస్​ప్లేని ఇందులో అమర్చారు. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ వల్ల గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1400 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఈ గ్యాడ్జెట్​లో అందించారు.

పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16పై నడుస్తుంది.

ఒప్పో రెనో 15సీ- కెమెరా సెటప్..

ఫోటోగ్రఫీ కోసం ఒప్పో రెనో 15సీ 5జీ స్మార్ట్​ఫోన్​ వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి:

  • 50ఎంపీ మెయిన్ కెమెరా
  • 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్
  • 2ఎంపీ మాక్రో షూటర్

ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ముందు భాగంలో కూడా 50ఎంపీ కెమెరాను ఇచ్చారు. విశేషమేమిటంటే, ఫ్రంట్- రియర్ కెమెరాల ద్వారా 4కే రిజల్యూషన్‌తో హై-క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

ఒప్పో రెనో 15సీ- ఇతర ప్రత్యేకతలు..

  • నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఇందులో ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి.
  • 5జీ నెట్‌వర్క్ సపోర్ట్, ఇన్-డిస్​ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్.
  • కేవలం 195 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్.
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More