200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో Realme 16 Pro సిరీస్​- ధర ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ, భారత మార్కెట్లోకి రియల్ మీ 16 ప్రో 5G మరియు 16 ప్రో ప్లస్ 5G మోడళ్లను విడుదల చేసింది. అద్భుతమైన కెమెరా, పవర్ ఫుల్ ప్రాసెసర్ మరియు భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ల పూర్తి సమాచారం మీకోసం.

Published on: Jan 07, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్ మీ 16 ప్రో సిరీస్ భారత్‌లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో రియల్​మీ సంస్థ 16 ప్రో 5జీ, రియల్​మీ 16 ప్రో ప్లస్ 5జీ మోడళ్లను లాంచ్​ చేసింది. మిడ్-రేంజ్ విభాగంలో ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే రంగులతో పాటు భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కెమెలియా పింక్, ఆర్చిడ్ పర్పుల్ కలర్స్​లో కూడా లభించనున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ధరలు, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో రియల్​మీ 16 ప్రో సిరీస్​ లాంచ్​..
ఇండియాలో రియల్​మీ 16 ప్రో సిరీస్​ లాంచ్​..

రియల్​మీ 16 ప్రో సిరీస్​- ధర, లభ్యత..

రియల్​మీ 16 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్​ఫోన్​ ధరలు ఇలా ఉన్నాయి:

  • 8GB + 128GB వేరియంట్: రూ. 39,999
  • 8GB + 256GB వేరియంట్: రూ. 41,999
  • 12GB + 256GB వేరియంట్: రూ. 44,999

రియల్​మీ 16 ప్రో 5జీ ధరలు ఇలా ఉన్నాయి:

  • 8GB + 128GB వేరియంట్: రూ. 31,999
  • 8GB + 256GB వేరియంట్: రూ. 33,999
  • 12GB + 256GB వేరియంట్: రూ. 36,999
  • ఈ స్మార్ట్​ఫోన్స్​ జనవరి 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్​మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయ.
  • డబుల్​ ధమాకా: అదిరే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 15, రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో లాంచ్.. ధర, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

రియల్​మీ 16 ప్రో ప్లస్ 5జీ- ఫీచర్స్​..

ఈ రియల్​మీ 16 ప్రో ప్లస్​ 6.8 ఇంచ్​ 1.5కే హైపర్‌గ్లో 4డీ కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, ఏకంగా 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో రాకెట్ LPDDR5X ర్యామ్‌ను అమర్చారు.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఇందులో 200 ఎంపీ మెయిన్ కెమెరా, 3.5ఎక్స్​ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 ఎంపీ టెలిఫోటో కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ ఫోన్​లో 7,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉండటమే కాకుండా, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్​మీ యూఐ 7.0 పై ఇది పనిచేస్తుంది.

రియల్​మీ 16 ప్రో 5జీ- ఫీచర్స్​..

ఈ రియల్​మీ 16 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5జీ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రూపొందింది. ఇందులో కూడా 200 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా దుమ్ము- నీటి నుంచి రక్షణ కోసం ఐపీ66/68/69 రేటింగ్స్‌తో వస్తున్నాయి.

ఇందులో కూడా 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 80డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వంటివి ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ పరంగా మూడు ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని రియల్​మీ సంస్థ హామీ ఇచ్చింది.