7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో Oppo A6 Pro 5G- ధర ఎంతంటే..

ఒప్పో ఏ6 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇదొక మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​. ఇందులో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా వంటి ఫీచర్స్​ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jan 6, 2026, 07:30:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒప్పో కంపెనీ తన 'ఏ' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్​ని లాంచ్​ చేసింది. దాని పేరు ఒప్పో ఏ6 ప్రో (Oppo A6 Pro). ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో ఏ6 ప్రో 5జీ..
ఒప్పో ఏ6 ప్రో 5జీ..

ఒప్పో ఏ6 ప్రో: 7,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 40 రోజుల స్టాండ్‌బై!

ఈ ఒప్పో ఏ6 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ని ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యతనిచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 రోజుల పాటు స్టాండ్‌బై సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని 80డబ్ల్యూ సూపర్ ఊక్ ఛార్జర్‌తో కేవలం 64 నిమిషాల్లో ఈ గ్యాడ్జెట్​ని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

ఒప్పో ఏ6 ప్రో 5జీ- ధర, లభ్యత..

భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది:

8జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్: దీని ధర రూ. 21,999 గా నిర్ణయించారు.

8జీబీ ర్యామ్​ + 256జీబీ స్టోరేజ్: దీని ధర రూ. 23,999.

లాంచ్ ఆఫర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో ‘అరోరా గోల్డ్’, 'కాపుచినో బ్రౌన్' రంగులలో సేల్​కి రెడీగా ఉంది.

  • మీ వాట్సాప్ సేఫ్​గా ఉందా? అకౌంట్‌ని కాపాడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్​ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఒప్పో ఏ6 ప్రో 5జీ- ఫీచర్లు..

ఒప్పో ఏ6 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​..

డిస్‌ప్లే: 6.75-ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ స్క్రీన్, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1,125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. మెరుగైన గ్రాఫిక్స్ కోసం ARM Mali-G57 MC2 GPUని జత చేశారు.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్-ఓఎస్ 15 పై ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది.

కెమెరా: ఒప్పో ఏ6 ప్రో 5జీ వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఆటోఫోకస్ సపోర్ట్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని ద్వారా 1080పీ క్వాలిటీతో వీడియోలను షూట్ చేయవచ్చు.

మన్నిక: ఈ ఫోన్‌కు ఐపీ69 రేటింగ్ ఉంది, అంటే ధూళి- నీటి నుంచి దీనికి గరిష్ట రక్షణ లభిస్తుంది.

భద్రత: సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మన్నికైన ఫోన్ కావాలనుకునే వారికి ఒప్పో ఏ6 ప్రో 5జీ ఒక మంచి ఎంపిక.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More