ఒప్పో నుంచి అదిరిపోయే కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్.. 'రెనో 15 ప్రో మినీ' లాంచ్​ త్వరలోనే!

ఒప్పో తన పాపులర్ రెనో సిరీస్‌లో సరికొత్త 'మినీ' మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది! అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రానున్న 'ఒప్పో రెనో 15 ప్రో మినీ' విశేషాలు ఇవే. ఈ నెలాఖరులో లేదా జనవరిలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Published on: Dec 21, 2025, 15:15:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘ఒప్పో’.. తన రెనో సిరీస్‌లో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది! వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఒక శక్తివంతమైన 'కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్' స్మార్ట్​ఫోన్‌ను తీసుకురావాలని ఒప్పో ప్లాన్ చేస్తోంది. దీనికి ‘ఒప్పో రెనో 15 ప్రో మినీ’ అని పేరు పెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు, ఇండియా లాంచ్ వివరాలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఒప్పో రెనో 15 ప్రో మినీ లాంచ్​ త్వరలోనే! (Representative Image)
ఒప్పో రెనో 15 ప్రో మినీ లాంచ్​ త్వరలోనే! (Representative Image)

ఒప్పో రెనో 15 ప్రో మినీ- లాంచ్​ ఎప్పుడు?

ప్రముఖ టిప్‌స్టర్ 'Gadgetsdata' సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్ ఇండియా లాంచ్ చాలా దగ్గర్లోనే ఉంది! డిసెంబర్ 2025 చివరి వారంలో లేదా జనవరి 2026 ప్రారంభంలో ఈ గ్యాడ్జెట్​ని ఒప్పో సంస్థ అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది.

దీని మోడల్ నంబర్ CPH2813 అని కూడా లీకులు చెబుతున్నాయి.

ఒప్పో రెనో 15 ప్రో మినీ- కీలక స్పెసిఫికేషన్లు ఇవే..

చిన్న సైజులో ఉన్నప్పటికీ, ఫీచర్ల విషయంలో ఈ ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్​ఫోన్ అస్సలు వెనకడుగు వేయడం లేదు. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో ఉండబోయే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

డిస్‌ప్లే: 6.32-ఇంచ్​ 1.5కే ఫ్లాట్ ఓఎల్​ఈడీ డిస్‌ప్లేతో రానుంది. ఇందులో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫోన్ చేతిలో ఇమిడిపోయేలా ఉండి, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

  • వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్స్​- ఇండియా లాంచ్​, ధరలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని సమాచారం. దీనివల్ల ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది.

కెమెరా: ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 3.5ఎక్స్​ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇస్తున్నారు.

ఛార్జింగ్: 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.

డిజైన్: ఈ ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్​ఫోన్ దాదాపు 187 గ్రాముల బరువు, 7.99 ఎంఎం మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇది గ్లేసియర్ వైట్ రంగులో, రిబ్బన్ తరహా ఫినిషింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనికి ఐపీ69 రేటింగ్ ఉంటుంది. అంటే నీటిలో పడినా లేదా డస్ట్​ తగిలిన ఫోన్‌కు ఏమీ కాదు!

అయితే, ఈ వివరాలపై ఒప్పో సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇవి లీకైన వివరాలు మాత్రమే. అయితే, ఇవే నిజమైతే, ఈ ఫీచర్లను బట్టి చూస్తుంటే, చిన్న సైజులో పవర్‌ఫుల్ ఫోన్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్​ కానుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More